రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్ : ఇంటి నిర్మాణ పనులు మేస్త్రి పాలిట యమపాశంగా మారాయి. కొత్త ఇంటి నిర్మాణం కోసం
రాడ్ కట్ చేసే మిషన్ బ్లెడ్ విరిగి మేస్త్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో
చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన గుడిహత్నూర్ మండలంలో చోటుచేసుకుంది. గుడిహత్నూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మన్నూర్ గ్రామానికి చెందిన కేంద్రే బాలాజీ (36) గత కొన్ని సంవత్సరాలుగా మేస్త్రి పనులు చేస్తూన్నాడు.
కేంద్రే బాలాజీ వృత్తిలో భాగంగా అదే గ్రామానికి చెందిన జాధవ్ లక్ష్మి బాయి కి చెందిన కొత్త ఇంటి నిర్మాణం పనులను మోలే గోవింద్ తో కలిసి తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం రోజు కొత్త ఇంటి కోసం రాడ్ కట్ చేసే మిషన్ తో రాడ్ కట్ చేస్తుండగా ఒక్కసారి మిషన్ బ్లెడ్ తెగి కేంద్రే బాలాజీ కి చేతికి మరియు కాలికి తగలడంతో లోతైన గాయాలయ్యాయి. హుటాహుటిన వైద్యం కోసం ఆదిలాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు హైదరాబాద్ కు రిపర్ చేశారు. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం నిమ్స్ కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం చనిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Recent Comments