రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ : కుమారి గ్రామం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీని ఆదరించింది, గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని బోథ్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నాయకుడు నిత్యం ప్రజలలో ఉండే నాయకుడు అన్నా అంటే నేను ఉన్నాను అని ధైర్యాన్ని చెప్పే నాయకుడు ఆడే గజేందర్ అని కుమారి గ్రామానికి చెందిన యాదవ సంఘం నాయకులు పేరొన్నారు.
గురువారం నేరడిగొండ పట్టణ కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామ యాదవ సంఘం సభ్యులు ఈ సందర్భంగా గ్రామంలో గల పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు మరియు గ్రామంలో గల శ్రీ రాజారాజేశ్వర టెంపుల్ మరియు యాదవ సంఘ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించిన మన అలుపెరుగని నాయకుడు ఆడే గజేందర్ ఖచ్చితంగా నిధులు మంజూరు చేయిస్తానని గ్రామంలో మందిరానికి మరియు సంఘ భవన నిర్మాణాలకు త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.
ఆయనను కలిసిన వారిలో కుమారి గ్రామ సర్పంచ్ రాజు యాదవ్, బి వెంకటరమణ, శ్రీనివాస్, రాజేందర్, వోర్స శ్రీనివాస్, రవి, రాజారాం, నరేందర్, వేణు, ప్రమోద్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆడే వసంత్ రావు, సీనియర్ నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి, అగ్గు రమేష్, మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments