రిపబ్లిక్ హిందుస్థాన్ , నిర్మల్ :
నిర్మల్ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన వి సుధాకర్ డెంగ్యూ తో ప్లేట్ లైట్స్ 10,000 కి పడి పోవడం తో నిర్మల లోని సంజీవిని ఆసుపత్రి లో చేరారు. పేషంట్ ప్లేట్ లైట్స్ ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో సహాయం కోసం వాట్సప్ ద్వారా సందేశం పంపారు. వాట్సాప్ సందేశం ద్వారా విషయం తెలుసుకున్న బోథ్ గ్రామానికి చెందిన మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ స్పందించి నిర్మల్ లోని కావేరి బ్లడ్ బ్యాంక్ వెళ్లి ఏబీ పాజిటివ్ రక్తాన్ని దానం చేశారు. అత్యవసర సమయంలో రక్తదానం చేయడంతో పేషంట్ కు ప్రాణాపాయం తప్పింది. ఆ యువకుడు చేసిన సహాయానికి పేషంట్ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన కార్యక్రమంలో మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు జాటల నగేష్, మధుకర్ మరియు తదితరులు పాల్గొన్నారు
అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు
RELATED ARTICLES
Recent Comments