ఉమ్మడి, సామాజిక వనరుల వినియోగాలపై హక్కు పత్రాలు ఇవ్వాలి
రిపబ్లిక్ హిందూస్తాన్ , జైనూర్( నవంబర్ 22): పోడు దారులకు హక్కులు కల్పించే విషయములో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు తెదీ లను ప్రకటించిన నేపథ్యంలో వాటి క్షేత్రస్థాయిలో ఎం జరుగుతుందనే విషయంలో కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, సిర్పూర్ (యు) , లింగాపూర్ మండలలో ఆదివాసి సేన ప్రతినిధి బృందం ఆదివాసి సేన రాష్ట్ర ఆధ్యక్షులు కోవ దౌలత్ రావు మోకాశి ఆధ్వర్యంలో
క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆనేక ఆదివాసీ సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు ఆదివాసి సేన ప్రతినిధి బృందం తెలిపారు.
ఏప్ ఆర్ సి కమిటీ వారు కుల ధృవీకరణ పత్రాలు, అడగటం, ప్రభుత్వ అధికారులు కుల దృవీకరణ పత్రాల జారీ విషయములో ఆలస్యం చేయడం పై అధికారులు, పోడు దరఖాస్తు స్వీకరణ చివరి తెదీ. 12, లేదా 18 తేది ఆని డేడ్ లైన్లు విధించడంతో ఆదివాసి పోడు దారులు చాలా ఆమోయమానికి గురి కావడం జరుగుతుందని అన్నారు. ఎప్ ఆర్ సి కమిటీ లు తూతూ మంత్రంగా వేయటం, ఎలాంటి గ్రామ సభలు, ఆవగహన కల్పించకపోవడం, మరియు రాష్ట్ర ఇప్పటి వరకు వ్వక్తి గత హక్కుల విషయంలో మాత్రమే దరఖాస్తులు స్వీకరించడం, సామజిక, సాముహిక హక్కుల విషయంలో ఎలాంటి స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దరఖాస్తులు ఎన్నివచ్చాయి అంటున్నారే తప్ప పోడు దారులు ఎంత ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకోవడం లేదని, కాబట్టి పోడు దారులకు ధరఖాస్తు స్వీకరణ తెదీలను పోడుగించాలని ఉమ్మడి, సామాజిక వనరులపై హక్కులు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన రాష్ట్ర ఆధ్యక్షులు కోవ దౌలత్ రావు మోకాశి, ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయిసిడం జంగు పటేల్, ఆదివాసి సేన కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆధ్యక్షులు కోట్నక్ గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు కోడప వామన్,
ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు పేందూర్ విశ్వనాథ్, ఆదివాసి రైతు సేన జిల్లా ఇంచార్జ్ తోడషం భూమ పటేల్, ఆదివాసి విద్యార్థి సేన నాయకులు కుంరం చత్రుఘన్, కుంరం విష్ణు, సలాం జాకు, రాయిసిడం బాలాజీ ,కుర్సేంగ లాల్ షావ్, కుంరం బక్కు, తోడషం భగవంత్, ఆర్క చిన్ను, జూగ్నక్ చిన్ను, మర్సకోల అశోక్
తదితరులు పాల్గొన్నారు..
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments