ఉమ్మడి ఆదిలాబాద్ , ఉమ్మడి ఖమ్మం జిల్లా ల్లో అభ్యర్థినిలు గా నామినేషన్లు దాఖలు…
రిపబ్లిక్ హిందూస్తాన్ : ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఆదివాసీ అభ్యర్థినిలుగా రాణీ దుర్గావతి వారసురాలు కొండ్రు సుధారాణి, ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కు నామినేషన్ సమర్పించారు. అలాగే జంగుబాయి వారసురాలు పెందూర్ పుష్పరాణి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా వారి వెంట పార్టీ కార్యకర్తలు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు .ఆదివాసుల రాజకీయ పోరాటం ఇక ఆరంభమైందని ఆదివాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెందోర్ పుష్పారాణీ నామినేషన్ వేయడం జరిగిందని ఆదివాసీ నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికి కూడా పాలకులు రాజకీయ పార్టీల నాయకులు ఆదివాసీలకు ఎమ్మెల్సీ సీటు మరియు రాజ్యసభ సీటు కేటాయించక పోవడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెందోర్ పుష్ప రాణి గారిని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నుకోవాలని కోరారు.ఈ యొక్క ఎన్నికకు అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించి ఈసారి ఆదివాసి మహిళా అభ్యర్థి అయిన పుష్ప రాణి అభ్యర్థిని బలపరచాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే కాంగ్రెస్ ,బిజెపి, టిఆర్ఎస్, స్వాతంత్ర ,సిపిఎం సిపిఐ ఎంఐఎం అందరూ కూడా బలపర్చారు మిగితా ఇంకా ఉన్న అన్ని వర్గాలు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉద్యమ నాయకురాలని మీ అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నుకోవాలని ఆ సంఘం నాయకులు కోరారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments