Friday, November 22, 2024

నలుగురు అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల అరెస్ట్


1.5 కేజీ ల గంజాయి, ఒక వ్యాన్, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం.

*ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి చకచక్యంగా పట్టుకున్న జిల్లా పోలీసులు.

*పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి.*

ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలో నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి పాత్రికా సమావేశం లో ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ ఆదేశాల మేరకు, సూచనల మేరకు గత నెల తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రతో అనుసంధానంగా ఉన్న లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుబడిన సందర్భంలో ఈ నిందితులు ఆ కేసులో మిగిలినవారుగా ఉండడం, అదేవిధంగా ఆ గంజాయి తరలించే క్రమం లో వాహనానికి ముందు ఒక వాహనంలో ఉంటూ గంజాయి పోలీసులకు లభ్యం కాకుండా ఫోన్ ద్వారా సంభాషిస్తూ ఉండడం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం పట్టుకున్న నిందితుల వివరాలు.
1) గోతిరాం గురుదయాల్ సాబ్లే s/o గురు దయాల్, బుల్దన జిల్లా మహారాష్ట్ర.
2) శుభం గోతిరాం సబ్లే s/o గోతిరాం సబ్లె, బుల్దాన జిల్లా, మహారాష్ట్ర.
3) అమర్ సింగ్ నారాయణ గోతి s/o నారాయణ గోతి, బుల్దాన మహారాష్ట్ర.
4) సోమనాథ్ బికా సాబ్లె s/o బికా, జెల్గాన్ జిల్లా, మహారాష్ట్ర.
లను  ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేసారు. వీరి వద్ద ఒకటిన్నర కిలోల గంజాయి మరియు మూడు సెల్ ఫోన్లు, గత నెలలో గంజాయి కేసులో వాహనానికి ముందుండి నడిపిన వ్యానును స్వాధీనం తీసుకున్నట్లు తెలిపారు. ఆ కేసు నందు ప్రధాన సూతధారిగా ఉన్న మిగిలిన వారిని కూడా అరెస్టు చేయడానికి ఈ బృందం కార్యచరణను కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు వాహనంలో ఉండగా, ఒకరు గంజాయిని వ్యాపారంగా చేసుకునే వ్యక్తి గా డిఎస్పి గారు తెలిపారు. అరెస్టు నందు ఎంతగానో కృషి చేసిన జైనథ్ సిఐ డి సాయినాథ్, రూరల్ సీఐ కె ఫనిధర్, ఎస్సై ముజాహిద్, సిబ్బంది రుక్మారెడ్డి, గంగాధర్ రెడ్డి, శ్రీనివాస్, సిబ్బంది తదితరులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని తెలిపారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి