Adilabad: శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. మంగళవారం టూటౌన్‌లో వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కల్‌గూడకు చెందిన అబ్దుల్ రషీద్ అలియాస్ రషీద్ ఖాన్ పాత వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. పోలీసులు ఓ వ్యక్తిని కొట్టినట్లు ఉన్న ఈ వీడియో పోస్టు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరైన శాంతిభద్రతలు, విద్వేశాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రూప్ అడ్మిన్లు ఇలాంటి పోస్టులు పెట్టకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Thank you for reading this post, don't forget to subscribe!సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తి రిమాండ్
Previous article
Recent Comments