రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రోజు మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. మిస్సింగ్ అయినా వ్యక్తి భార్య ఫిర్యాదు మరియు ఎస్సై తెలిపిన వివరాల మేరకు ఇచ్చోడ మండల కేంద్రం లోని టీచర్స్ కాలనికి చెందిన కదం ఆనంద్ రావ్ (55) అనే వ్యక్తి గత రెండు సంవత్సరాలు గా పక్షవాతంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. పక్ష వాతం రావడం తో వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. దింతో మానసికంగా క్రుంగి పోయి ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఆనంద్ రావ్ భార్య కౌసల్య బాయి అడ్డు పడడంతో ప్రయత్నం విరమించుకున్నాడు. గత నాలుగు రోజుల నుండి ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో చెబుతున్నాడు. అయితే తిరుపతి దేవస్థానం వెళ్తానని ఒక కాగీతం పై రాసి గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో నుండి రూ.21 వేలు తీసుకుని ఏటో వెళ్ళిపోయినట్లు తెలిపారు. సదరు వ్యక్తి ఒంటి పై బూడిద నీలం పసుపు రంగు గీతలు గల కాలర్ అప్ టీ షర్ట్, గ్రే కలర్ నెక్కర్ ఉందని తెలిపారు. తెల్లని జుట్టు గడ్డం తో ఉంటాడని, సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఎవరికైనా కనిపిస్తే స్థానిక ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లేదా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని అన్నారు.
ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసీ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం కూడా ఇస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Recent Comments