నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తులసి పేట గ్రామానికి చెందిన నలుగురు అనాధ పిల్లలకు రైతు భీమా ఫలాలు అందడం లేదు.
తులసిపేట గ్రామానికి చెందిన గజ్జెల గంగాధర్ , గజ్జెల లక్ష్మీ లకు

ముగ్గురు కొడుకులు గజ్జెల భూమేష్ (18), గజ్జెల నగేష్ (16) , గజ్జెల రాజన్న (12) , ఒక కూతురు దీక్షిత (10) సంవత్సరాల వయస్సుగల నలుగురు సంతానం.
అయితే గజ్జెల గంగాధర్ భార్య గజ్జెల లక్ష్మీ తొమ్మేదెళ్ల క్రితం మృతిచెందిది. ఈ రకంగా తల్లిని కోల్పోయిన పిల్లలను తండ్రి అన్ని తానై ఎలాగోలా కుటుంభాన్ని పోషిస్తున్నా తరుణంలో తండ్రి గత సంవత్సరం క్రితం చనిపోవడంతో నలుగురు పిల్లలు అనాధలయ్యారు. తొమ్మేదెళ్ల కింద తల్లి, సంవత్సరాల క్రితం తండ్రి చనిపోవడంతో ఆ నలుగురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

రైతుభిమా కోసం….
గజ్జెల గంగాధర్ పేరిట ఉమ్మడి గ్రామపంచాయతీ పసుపులా పరిధిలోని తులసిపేట గ్రామంలో పసుపుల గ్రామ శివారులో ఒక ఎకరం భూమి ఉంది. శంకర్ పేరిట పట్టనెంబర్ T14160010094 , ఖాతా నెంబర్ 182 గల పట్టా ఉంది.

రైతు భీమా నామినిగా మృతిని అన్న కొడుకు గజ్జెల రాజు పేరును నమోదు చేసుకున్న అధికారులు
గజ్జెల గంగాధర్ యొక్క రైతు భీమా కోసం నామినిగా అధికారులు గంగాధర్ యొక్క అన్న కొడుకు గజ్జెల రాజేందర్ పేరును నమోదు చేసుకున్నారు. గంగాధర్ యొక్క కొడుకులు , కూతురు మైనర్లు కావడంతో అన్న కొడుకు పేరును నమోదు చేసుకున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. అయితే ఇపుడు గజ్జెల గంగాధర్ పెద్ద కొడుకు భూమేష్ మేజర్ కావడంతో తండ్రి భీమా డబ్బులు తమకు చెల్లించాలని అధికారులను కోరారు. తండ్రి చనిపోయి ఏడాది గడిచిన ఇంకా డబ్బులు రాకపోవడంతో ఆర్థికంగా ఆ కుటుంబం కష్టాలు అనుభవిస్తుంది.
ఇదే విషయం పై వ్యవసాయ అధికారిని వివరణ కోరగా … వారి మాటల్లోనే… క్రింద చదవండి
పిల్లలు మైనర్ కావడంతో నే మృతిచెందిన రైతు అన్న కొడుకును నామినిగా చేర్చామూ… రైతు భీమా నమోదు సమయంలో రైతు యొక్క పిల్లలు మైనర్లు ఉండే. రైతు భీమా పథకం పాలసీ ప్రకారం నామినిగా ఉండే వారి వయస్సు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. లేని యెడల అర్హులుగా కారూ . అందువల్లే ఇలా జరిగింది. నిజమైన వారసుల పేర్లు అప్డేట్ చేసి పంపిస్తే ఎల్ ఐ సి అధికారులు ఒప్పుకోవడం లేదు. మృతుని అన్నా కొడుకు గజ్జెల రాజు పేరిట మళ్ళీ రిపోర్టు పంపిస్తున్నాము. మృతిని వారసుల నుండి నో అబజక్షన్ నోటరీ తీసుకున్నాం. ఇప్పుడు మళ్లీ నివేదిక పంపిస్తున్నాము. త్వరలో భీమా డబ్బులు వచ్చేలా చేస్తాము. కాని రైతు పిల్లల పేరిట డబ్బులు రావు.
— రాజ్ కుమార్ , అగ్రికల్చర్ ఎస్ట్రెంషన్ ఆఫీసర్
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments