కుంరం భీమ్ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : గురువారం ఇచ్చోడ మండలంలోని బొజ్జుగుడా గ్రామములో ఇటీవల స్థాపించిన కుంరం భీమ్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి పూలమాలతో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కుంరం భీం కు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కుంరం భీమ్ పోరాట పటిమను గుర్తు చేశారు. కుంరం భీమ్ ఆశయాలకనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం ఆదివాసుల విషయములో ముందుకు సాగుతుందని, గత పాలకుల కాలములో జోడెన్ ఘాట్ కు వెల్లలంటేనే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో స్వంత అస్థిత్వముతో తలెత్తుకునేల స్మృతి వనాన్ని,మ్యూజియాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. పోడు భూముల విషయములో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని, గూడలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యన్ని కల్పించారన్నారు. గత పాలకులు ఎవరు కూడా అధివాసులను పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఈ కార్యక్రమములో సిరికొండ మండల కన్వీనర్ బాలాజీ, ఇచ్చోడ మాజీ ఎంపీపీ దుక్రే సుభాష్ పటేల్, బొజ్జుగుడా గ్రామ పటేల్, నర్వడే ఈశ్వర్, దాబా బి సర్పంచ్ రామారావు, టి.ఆర్.ఎస్.వి బోథ్ ప్రెసిడెంట్ గొర్ల శంకర్ యాదవ్, ఓంకార్, శ్రీహరి, రాథోడ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments