
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ కలెక్టరేట్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామగిరి సర్పంచ్ తొడసం భీం రావ్ సోమవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిసి గ్రామపంచాయతీ లో నెలకొన్న సమస్యల పై వినతిపత్రం సమర్పించారు. ఆదివారం రోజు కామగిరి గ్రామం నుండి పాదయాత్ర గా వెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నిధులు లేక అభివృద్ధి పనులు జరగడం లేదని అన్నారు . అధికారులు నిర్లక్ష్యం వల్ల గ్రామపంచాయతీ లో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. గ్రామపంచాయతీ లో నెలకొన్న సమస్యలను వ్రాత పూర్వకంగా కలెక్టర్ కు అందించారు.
Recent Comments