— ఎడిటర్స్ అసోసియేషన్ డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
విలేఖరుల పై దాడులు చేస్తే పిడి ఆక్ట్ నమోదు చేయాలనీ ఆదిలాబాద్ జిల్లా పత్రిక ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాకార్యదర్శి లింగన్న, ఫిరోజ్ ఖాన్ లు డిమాండ్ చేశారు. నిత్యం సమాజ శ్రేయస్సు కోసం వృత్తి నిర్వహణలో మెరుగైన సమాజం నిర్మించేందుకు కృషి చేస్తున్న జర్నలిస్టులపై దాడులు జరగడం విచారించ దగ్గ విషయమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కీలక పాత్రపోషిస్తున్న జర్నలిస్టులపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టన్నారు. ఇటీవలే ఇచ్చోడ లో ఓ విలేకరి పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, దాడి కి పాల్పడ్డ వ్యక్తులపై విచారణ జరిపి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
Recent Comments