మీకు డిగ్రీ ఉందా? బీటెక్ పాసయ్యారా? అయితే మీ కోసమే ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నంలో యూనిట్లలో 361 పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన (నాలుగేళ్ల ఫిక్స్‌డ్ టర్మ్) ఉంటాయని నోటిఫికేషన్ లో తెలిపారు. మరి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దామా..
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పేర్కొన్న మొత్తం 361 పోస్టుల్లో 136 ప్రాజెక్ట్ ఇంజినీర్/ ఆఫీసర్ పోస్టులు, 142 ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ అసిస్టెంట్ పోస్టులు, 83 ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్ పాసై ఉండటంతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.
విద్యార్హతలో మెరిట్ లిస్ట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 17,18,21,22,25 తేదీల్లో ఎంపిక చేసిన సెంటర్లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసే వారి వయస్సు 14.02.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.300గా, ఇతర పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.200గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజులో రాయితీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలకు https://bdl-india.in/ వెబ్ సైట్ సందర్శించండి.
పైన పేర్కొన్న పోస్టుల జీతం వివరాలు చూస్తే.. ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు నెలకు రూ.30,000-రూ.39,000, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు నెలకు రూ.25,000 – రూ.29,500, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్‌కు నెలకు రూ.23,000- రూ.27,500 ఉంటుంది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments