Saturday, August 30, 2025

Job alert: నిరుద్యోగ యువతులకు సువర్ణ అవకాశం … భరోసా సెంటర్ లో…

జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

*భరోసా సెంటర్ నందు ఉద్యోగాలు*

*అర్హత గల యువతులు వినియోగించుకోగలరు.*

*ఫిబ్రవరి ఒకటవ తారీకు వరకు దరఖాస్తుల స్వీకరణ.*

*యువతులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.*

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉమెన్ సేఫ్టీ వింగ్ (షీ టీమ్స్ మరియు భరోసా) తెలంగాణ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న భరోసా సెంటర్ యందు తాత్కాలిక ప్రాతిపాదికన ఎంపికకోసం ఆసక్తి గల వారు ఈ దిగువ తెలియజేసిన విధంగా ధరఖాస్తులు చేసుకోగలరని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

*భరోసా సెంటర్ ఆదిలాబాద్ జిల్లా యందు వివిధ కేటగిరిలో 5 ఖాళీలు గలవు.*

(1) కౌన్సిలర్ కం సెంటర్ కోఆర్డినేటర్ ఖాళీలు – 1
(2) సపోర్టు పర్సన్స్ ఖాళీలు – 2
(3) రిసిప్షనిస్టు ఖాళీలు – 1
(4) ఎ.ఎన్.ఎమ్ ఖాళీలు – 1
గలవు.

*1) కౌన్సిలర్ కం సెంటర్ కోఆర్డినేటర్ :*

మహిళా అభ్యర్థులు మాత్రమే వయస్సు 25 సం॥ నుండి 45సం|| లోపు ఉండాలి. నెలసరి జీతం : రూ॥ 25,000+ 5000/-
విధ్యార్హత : ఎం.ఎస్.సి / ఎం. ఏ సైకాలజీ లేదా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్.


అనుభవం :
మహిళలు/పిల్లలకు సైకో-సోషల్ కౌన్సెలింగ్ అందించడంలో సంబంధిత అనుభవం 24 నెలల కంటే తక్కువ ఉండకూడదు.
కనీసం 50 మంది సంబంధిత క్లయింట్‌లను నిర్వహించి ఉండాలి మరియు 100 కంటే తక్కువ కౌన్సెలింగ్ సెషన్‌లను నిర్వహించాలి.
హింస/ట్రామా కౌన్సెలింగ్ బాధితులకు కౌన్సెలింగ్ చేసిన గత అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
మహిళలు మరియు పిల్లల రంగంలో సామాజిక రంగం / NGO లో పనిచేస్తున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.


గమనిక:
పాఠశాల, కళాశాల లేదా ఏజెన్సీ కెరీర్ కౌన్సెలర్లు మొదలైన వారికి ఈ స్థానం వర్తించదు.

*2) సపోర్టు పర్సన్ :*

మహిళా అభ్యర్థులు మాత్రమే, వయస్సు 25 సం॥ నుండి 35సం||లోపు ఉండాలి
నెలసరి జీతం: రూ. 20,000/-
విధ్యార్హత: సోషల్ వర్క్, చైల్డ్ డెవలప్మెంటు / సైకాలజిస్ట్ పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ ఉండాలి.
అనుభవం : ధరఖాస్తు దారులు 12 నెలల కంటే తక్కువ అనుభవం ఉండకూడదు బాలల హక్కులు లేదా పిల్లల రక్షణ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి లేదా స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ లేదా అలాంటి సంస్థతో కలిసి పనిచేసి ఉండాలి లేదా పిల్లల సంరక్షణలో ఉన్న చిల్డ్రన్స్ హోమ్ లేదా షెల్టర్ హోమ్ అధికారి అయి ఉండాలి లేదా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో ఉద్యోగంలో అయినా ఉండాలి.

*3) రిసిప్షనిస్టు :*
మహిళా అభ్యర్థులు మాత్రమే వయస్సు 25 సం॥ నుండి 35సం||లోపు ఉండాలి.
నెలసరి జీతం : రూ॥ 15,000/-
విధ్యార్హత : గ్రాడ్యూయేట్ అయి ఉండాలి మరియు కంప్యూటర్ లిటరేటు అయి ఉండాలి, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇవ్వబడును.

అనుభవం : ధరఖాస్తు దారులు 24 నెలల కంటే తక్కువ అనుభవం ఉండకూడదు.

*4) ఎ.ఎన్.ఎమ్ :*
మహిళా అభ్యర్థులు మాత్రమే వయస్సు 25 సం॥ నుండి 35 సం||లోపు ఉండాలి
నెలసరి జీతం : రూ॥ 16,000/-
విధ్యార్హ త : బి.ఎస్.సి నర్సింగ్
జి.ఎన్.ఎమ్ ( జనరల్ నర్సింగ్ మరియు మిడ్వైఫరీ )
ఎ.ఎన్.ఎమ్ ( సహాయక నర్సు మరియు మిడ్వైఫరీ )
అనుభవం: గైనకాలజిస్ట్ / పిడియాట్రిషియన్ / సర్జన్తో 24 నెలలకు తక్కువకాకుండా పనిచేసిన అనుమభం ఉండాలి.
లేదా ఐ.సి.యు మరియు అత్యవసర చికిత్సల నందు అనుభవం ఉండాలి
ఎమ్.టి.పి / అబార్షన్, డెలివరీ విధానాలను చేపట్టి ఉండాలి లేదా సహయం చేసి ఉండాలి.

*దరఖాస్తుదారులు పూర్తి సమాచారంతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని డి.సి.ఆర్.బి సెక్షన్ యందు ఎస్సై హాకీం 8712566264 ను తేది: 01-02-2024 లోపు అభ్యర్థన లను సమర్పించగలరు.*


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి