ప్రమాదకరంగా జామిడి పల్లె ప్రకృతి వనం గేటు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
జామిడి గ్రామపంచాయతీ పల్లె ప్రకృతి వనం లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మీరు సేదతిరడానికి వెళితే ప్రమాదం కొన్నితేచ్చుకున్నట్లే.
సోమవారం పల్లె ప్రకృతి వనం సందర్శన కు వెళ్లగా, పల్లె ప్రకృతి వనం గేటు ఒ వైపు ఒరిగి పోయి పడిపోవడానికి సిద్ధం గా కనిపించింది. ముందు జాగ్రత గా దానికి ముట్టుకోకకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

ఆ గేటు గత సంవత్సరం క్రితం గాలి దుమరానికి పడిపోయినట్లు సమాచారం. కానీ గ్రామపంచాయతీ పాలకవర్గం దాన్ని నెమ్మదిగా మరమ్మత్తులు చేయకుండా.. మళ్ళీ పక్కన ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళ తో అలాగే సెట్ చేసేశారు. కానీ ఈ విషయం తెలియని వారు గేటును తెరవడానికి ప్రయత్నిస్తే ప్రాణనికే ప్రమాదం. గేటు కేవలం బండ రాళ్ళ పై అలంకరణ కోసం నిలబెట్టారు. నీటి సౌకర్యం లేక చెట్లు ఎండుతున్నాయి.

ఇంకో విచిత్రం ఏమిటంటే పల్లె ప్రకృతి వనం కోసం ప్రజలు వెళ్ళేది స్వచ్ఛమైన గాలి మంచి వాతావరణం కోసం , కానీ జామిడి పల్లె ప్రకృతి వనం దగ్గర ఊరి నుండీ సేకరించిన చెత్తను పారేసిన వాసనతో స్వాగతం లభిస్తుంది.
అక్కడ పల్లె ప్రకృతి వనం కోసం చేసిన ఖర్చు మరియు మిగత వివరాలతో కూడిన శిలాఫలకమును పరిశీలించగా అందులో 2 లక్షల 50 వేలకు పైగా ఖర్చు చేసినట్లు ఉంది.
లక్షలు ఖర్చు చేసి ఇలా ఉపయోగం లో లేకపోతే ప్రజాధనం వృధా అయినట్లే కదా అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
పల్లె ప్రకృతి వనం నిర్వహణలో గ్రామపంచాయతీ పాలకవర్గం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు అక్కడి పరిస్థితితులు అద్దంపడుతున్నాయి.
Recent Comments