ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper

మంత్రి వర్గం నుంచి కేటీఆర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి : సూర్యకాంత్ గిత్తే

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడటీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ను వెంటనే భర్తరఫ్ చేయాలని బీజేపీ నాయకుడు బోథ్ నియోజకవర్గ కన్వీనర్ సూర్యకాంత్ గిత్తే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీనిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను నీరు గార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం లీకేజీలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.

పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున నష్టపరిహారాన్ని రాష్ట్రప్రభుత్వం అందించాలని పేర్కొన్నారు. లీకేజీ వ్యవహారంలో ఉన్న దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నేడు ఇచ్చోడ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకోను చేపడుతున్నామని చెప్పారు. నియోజక వర్గంలోని బీజేపీ ప్రజాప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాఉపాధ్యక్షులు మాధవరావ్, గుమ్మడి భీమ్ రెడ్డి,  బీజేవైఎం జిల్లా కార్యదర్శి చంద్ర శేఖర్, నాయకులు పెరుమాండ్ల పోశెట్టి, రమేశ్, జాధవ్ రాము, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!