Tuesday, July 29, 2025

ఆదిలాబాద్‌లో నకిలీ ఆయుర్వేద వైద్యంతో మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్



ఆదిలాబాద్ జిల్లా, జూలై 29, 2025 , రిపబ్లిక్ హిందుస్థాన్  : ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ఆయుర్వేద వైద్యం పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పత్రికా సమావేశంలో వివరాలు వెల్లడించారు.



ఆదిలాబాద్‌లో 8 కేసులు నమోదు, 9 మందిపై చీటింగ్ కేసు (BNS 318(4), 316). 8 మంది అరెస్టు, ప్రధాన నిందితుడు కుమార్ @ బాబా (66, గుల్బర్గా, కర్ణాటక) పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.



ముఠా సభ్యుల నుండి 6 ద్విచక్ర వాహనాలు, 15 మొబైల్ ఫోన్‌లు, సిమ్ కార్డులు, నకిలీ ఆయుర్వేద మందులు, రూ.10,000 నగదు, బ్యాంకులో రూ
23,000 సీజ్ చేసినట్లు తెలిపారు.

ఈ ముఠా సభ్యులు ఆసుపత్రులు, సూపర్ మార్కెట్‌ల వద్ద అనారోగ్యంతో ఉన్న వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకొని, నకిలీ ఆయుర్వేద మందులు అమ్మి లక్షల్లో డబ్బు లూటీ చేశారు.

బాధితుల మొబైల్ నంబర్లు సేకరించి, ప్రధాన నిందితుడు కుమార్ @ బాబా సంప్రదించి మోసం చేశాడు. మావలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయుర్వేద దుకాణంలో 5,000-10,000 రూపాయలకు నకిలీ మూలికలు అమ్మినట్లు పేర్కొన్నారు.

ఆదిలాబాద్ వన్ టౌన్‌లో 5, టూ టౌన్‌లో 1, మావలాలో 2 కేసులు నమోదు.

ముఠా సభ్యుల వివరాలు….
  1. శేఖర్ రెడ్‌లైన్ (27), ఘజీపూర్)
  2. పెంద్రే కుమార్ (29), ఉగర్ ఖుర్ద్, కర్ణాటక)
  3. గోలార్ సంతోష్ (32), ధారవాడ్, కర్ణాటక)
  4. కొండంగల్ అమ్రేశ్ (28), గుల్బర్గా, కర్ణాటక)
  5. గోలార్ ఆనంద్ (32), హుబ్లీ, కర్ణాటక)
  6. యలిగర్ హజ్రత్ (42), గోకాక్, కర్ణాటక)
  7. నాగేష్ (19), గుల్బర్గా, కర్ణాటక)
  8. అనిల్ కుమార్ (28), గుల్బర్గా, కర్ణాటక)

ఈ ముఠా సభ్యులు సూర్యాపేట, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడ్డారని తెలిపారు.

గుర్తింపు పొందిన వైద్యులను సంప్రదించి, నకిలీ ఆయుర్వేద మందులను నమ్మకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ సూచించారు.

ఈ ఆపరేషన్‌లో ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్, ఎస్సై నాగనాథ్‌లను ఎస్పీ అభినందించారు. పత్రికా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు బి. సునీల్ కుమార్, సీహెచ్ కరుణాకర్ రావు, కె. స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి