— అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స చేసి గాయపడిన వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఇంద్రవెల్లి ఎస్సై డి సునీల్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
బుధవారం మధ్యాహ్నం గుడిహాత్నూర్ మండలం తోషం గ్రామ శివారు లో గుర్తుతెలియని వాహనం ఢీకొని దంతనపల్లి గ్రామానికి చెందిన షేక్ ఫరూక్ అనే వ్యక్తి గాయాలపాలై, ఊపిరి ఆడక పోవడంతో ఆదిలాబాద్ నుండి ఇంద్రవెల్లి వెళ్తున్న ఎస్సై డి సునీల్ అతనిని చూసి వెంటనే ఊపిరి ఊది మరియు ప్రధమ చికిత్స అందించి తన వాహనంలో గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి ప్రాణాపాయం నుండి కాపాడడం జరిగింది. తదుపరి ఆ వ్యక్తిని అత్యవసర చికిత్స మేరకు రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి మార్చడం జరిగిందని తెలిసింది. అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స అందించి ప్రాణం పాయం నుండి కాపాడడంలో ఎంతగానో దోహదపడిన ఎస్సై డి సునీల్ ను పోలీసు అధికారులు, జిల్లా ప్రజలు ప్రశంసించడం జరిగింది.




Recent Comments