రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇచ్చోడ మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో TTWRJC BOYS హాస్టల్ మరియు అడిగామా బి గ్రామం లో Medical & Health Camp నిర్వహించారు.
ఈ సందర్భంగా అడిగామా బి గ్రామంలో ఒకరు డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించి, వారి ఇంట్లో ఆరోగ్య పరీక్షలు చేసి మందులు అందించారు. అలాగే వర్షాకాలంలో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులను గుర్తించి మందులు పంపిణీ చేశారు. రక్తపోటు (BP), మధుమేహం (Sugar) వంటి వ్యాధులను గుర్తించి అవసరమైన చికిత్స అందించారు.

గర్భిణీ స్త్రీలు సక్రమంగా మందులు వాడాలని సూచించారు. అదేవిధంగా ఇళ్ల చుట్టూ నీళ్లు నిల్వ ఉండే ప్రదేశాలు, ట్యాంకులు, కొబ్బరి చిప్పలు, పూల కుండీలలో దోమల లార్వాలను గుర్తించి తొలగించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి దోమల ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రశాంత్ (MLHP), PHN రాజు భాయ్, ఉత్తం (HS) రాథోడ్ కైలాష్, సుభాష్ (Health Assistant), వసంత్ సుభాష్ (Breeding Chakkar’s) మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Recent Comments