లారీ అద్దాలు పగలగొట్టి, డ్రైవర్ వద్ద డబ్బుకాజేసిన నలుగురు.
ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.
బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు, యువకుల అరెస్ట్.
ఆదిలాబాద్: వివరాలలో గురువారం మే 2 తారీకు రోజు ఉత్తరప్రదేశ్ కు చెందిన లారీ డ్రైవర్ ఫుర్ఖాన్ అలీ ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితులు నలుగురు పట్టబడ్డారని ఉట్నూరు ఎఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. నిందితుల వివరాలు
1) షేక్ సోహెలుద్దీన్, డ్రైవర్, ఇచ్చోడా.
2) సలాం శ్రావణ్ కుమార్, అడేగం, ఇచ్చోడా.
3) షేక్ రహిల్ షేక్ గఫార్, కిన్వర్ట్, మహారాష్ట్ర.
4) సలాం @ అబ్దుల్ యాసిర్, సిరి చల్మా గ్రామం , ఇచ్చోడ.
నలుగురు నిందితులు రెండవ తారీఖున హర్యానా దాబా వద్ద ఆగి ఉన్న లారీ అద్దాలను పగలగొట్టి బాధితుడి వద్ద నుండి ఆరున్నర వేల రూపాయలను దారిదోపిడి చేశారని తెలిపారు. నిందితులను పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. నిందితులపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నందు 141/ 2025, అండర్ సెక్షన్ 309 (4) బిఎన్ఎస్ తో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. తప్పు చేసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. యువత ను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని చెడు మార్గంలో ప్రయాణించకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.
Recent Comments