Tuesday, October 14, 2025

అధికారుల ఫ్లెక్సీ చర్యలు…. నవ్వుకుంటున్న జనం

అక్రమ వెంచర్ల పై ఫ్లెక్సీలతో సర్జికల్ స్ట్రైక్ చేస్తున్న అధికారులు , కాని మాయమైపోతున్న ఫ్లెక్సీ

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడా మండల కేంద్రంలో వెలిసిన అక్రమ వెంచర్లపై అధికారుల చర్యలపై జనం నవ్వుకుంటున్నారు. అసలు అధికారుల వాల్యూ తగ్గిందా అని సెటైర్లు వేస్తున్నారు. జనం సెటైర్లు వేయడంలో కూడా తప్పు లేదు… ఈ క్రింది వార్త చదివితే మీరు నవ్వుతారు… అధికారులకు అక్రమ వెంచర్ వ్యాపారులు అడుతున్న దాగుడుమూతల ఆట చూస్తే .. ఇది మామూలు ఆట గానే జనం ఇట్టే అర్థం చేసుకుంటున్నారు.
విషయం ఏమిటంటే గతంలో ఇచ్చోడా మండల కేంద్రము తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమ వెంచర్లలలో ప్లాట్ల విక్రయాలు జరుగుతుండగా జిల్లా అధికారులు స్థానిక పంచాయితీ అధికారులతో కలిసి సదరు అక్రమ వెంచర్లలో బ్లెడ్ బండి ద్వారా వెంచర్లను ద్వంసం చేసి హెచ్చరిక పేరిట ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. కానీ ఆ ఆ తరువాత మ్యాటర్ ఎలా సెటిల్ అయిందో కాని అనుమతులు లేని 3 వెంచర్లు ఉన్నచోట వ్యాపారులు మళ్ళీ 8 అనుమతి లేకుండా వెంచర్లకు తమ సామ్రాజ్యం విస్తరించుకున్నారు. అయితే అక్రమ వెంచర్లు అని ఎక్కడైతే ఫ్లెక్సీ కట్టారో అక్కడే విద్యుత్ శాఖ అధికారులు తమ వంతు సహాయం గా ఆ అక్రమ వెంచర్లలో విద్యుత్ స్తంభాలు , ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పటు చేసి దగ్గరుండి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు.

అయితే ఏమయిందో గాని మళ్ళీ ఇంకోసారి జిల్లా అధికారితో పాటు అక్రమ వెంచర్లు వెలసిన సదరు ఏరియా గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి మళ్ళీ అనుమతి లేని లే అవుట్ అని ఎవరు ప్లాట్లు కొన్న , నిర్మాణాలు చేపట్టిన కూల్చివేస్తాం అని హెచ్చరిక పేరిట ఫ్లెక్సీలు కట్టారు… ఓ రెండు రోజుల తరువాత మ్యాటర్ ఎం సెటిల్ అయ్యిందో, వెంచర్ వ్యాపారులు ఏ మంత్రం జపిస్తున్నారో తెలియదు గాని… మళ్ళీ ఆ ఫ్లెక్సీలు మాయం అయ్యాయి….
దింతో అసలు దీనిలో ఎదో దాగుడుమూతల ఆటల గమ్మత్తు ఉందని జనంలో టాక్ నడుస్తుంది.

అధికారుల ఆడుతున్న చర్యల పేరిట చేస్తున్న ఫ్లెక్సీ చర్యల పై జనం నవ్వుకుంటున్న వేళా మీకోసం ఈ వార్త….
మీ అభిప్రాయాలను మాకు ఈమెయిల్ feedback@republichindustan.in ద్వారా పంపండి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!