వెంచర్ మధ్యలో నుండి కాలువ… ఇద్దరు భూ యజమానుల మధ్య గొడవ …
లే అవుట్ భూమి తనదంటే తనదంటూ వాగ్వాదం…!
రిజిస్ట్రేషన్ ప్లాట్లు అంటూ జోరుగా ప్రచారం/ అమ్మకాలు…. ఇప్పుడేమో ఇలా … !
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ – డెస్క్ :
ఇచ్చోడాలో బుదవారం రోజు విచిత్రం చోటు చేసుకుంది. ఓ వెంచర్లో పక్కోడి భూమిని కబ్జా చేసి అందులో వెంచర్ చేసిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రిపబ్లిక్ హిందుస్థాన్ అక్రమ వెంచర్ల పై అందిస్తున్నటువంటి వార్తలలో ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలను ఎందుకు హెచ్చరిస్తుందో ఈ ఉదంతాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
పక్కోడి భూమిని వెంచర్ లో కలుపుకుని…
ఇచ్చోడ మండలంలోని అడిగామా బి గ్రామపంచాయతీ పరిధిలో ఆడేగామ బి శివారం లోని సర్వేనెంబర్ లు 6,7 లలో కొంతమంది ఇతర వ్యక్తుల వద్ద భూమిని విడివిడి గా కొనుగోలు చేశారు. అయితే అందులో ఓ వ్యక్తి 4 ఎకరాల 13 గుంటల భూమిలో మరో వ్యక్తికి చెందిన భూమి విస్తీర్ణం 1.27 ఎకరాలను కలుపుకుని 5.40 ఎకరాల భూమిలో లే అవుట్ తీసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. మా భూమినీ కూడా ఇది తన భూమే అని మొత్తం భూమిలో లే అవుట్ల కోసం రోడ్లను రాత్రికి రాత్రే వేసుకున్నట్లు భూ బాధితులు పేర్కొన్నారు. బాధితులు రెవెన్యూశాఖ అధికారులను ఆశ్రయించి భూమిని సర్వే చేయించగా బుధవారం రోజు సర్వేయర్ లు చూపెట్టిన హాద్దుల ప్రకారం జేసీబి తో కాలువలు తీస్తుండగా వెంచర్ లో బాధితుల భూమిని కలుపుకున్న వ్యక్తీ జేసిబి పనులు ఆపి వేశారు. సర్వే పంచనామా కాపీని బాధితులు పోలీసులు అందించినట్లు తెలిపారు. అయితె ఇరువురు కూర్చుని సమస్య పరిష్కారం చేసుకోవాలని పోలీసులు సూచించారని బాధితులు తెలిపారు. బాధితులు కాలువ పనులను నిలిపి వేశారు.
రేపటి రోజు ఏం జరుగుతుందో తెలయదు గానీ , వేంచర్ తీసి నెలలు గడుస్తున్న సంబంధిత అధికారులు ఎందుకూ అటు వైపు దృష్టి సారించలేదు. బాధితులు సర్వే చేయించే వరకు కూడా ఆ భూమిలో వివాదం ఉండగా ప్రజలను ఎందుకు చైతన్య పరచలేదు…? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ముందే హెచ్చరించిన రిపబ్లిక్ హిందుస్థాన్
గత కొన్ని రోజులుగా ఆక్రమ వెంచర్ల పై రిపబ్లిక్ హిందుస్థాన్ లో వార్తలు ప్రచురితం అవుతున్నాయి. అక్రమ వేంచర్ల ద్వారా జరిగే నష్టాలు ముందుగానే పసిగట్టి ప్రజలను చైతన్య పరచడమే కాకుండా, ఈ ఆక్రమ వెంచర్ల ద్వారా ప్రజలు నష్టపోతున్న విధానంతో పాటు ఆక్రమ వెంచర్లు దారులు ఏ మేరకు దోపిడీ చేస్తున్నారో అనే విషయాన్ని అధికారుల దృష్టికి వార్తల రూపంలో ఎన్నోసార్లు తీసుకెళ్లడం జరిగింది. కానీ అధికారులు ఆటువైపుగా దృష్టి సారించకపోవడం విశేషం. అయితే బుధవారం రోజు జరిగినటువంటి ఈ భూవివాదం చూస్తుంటే కొనుగోలుదారులకు, భయబ్రాంతులకు గురయ్యేలా అయోమయంలో పడేసేలా ఉంది. అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి వేరే సర్వే నంబర్ భూమిని తమ వెంచర్లు కలుపుకొని ప్లాట్లు విక్రయించడమే కాకుండా వాగును సైతం బండరాళ్లతో నింపి దాన్ని చదును చేసి ప్లాటుగా విక్రయిస్తున్నారంటే రియల్ మాఫియా ఈ స్థాయిలో బరితెగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. వాగు ను వదల కుండా భూములను రబ్బరు సాగించి నట్లు సాగిస్తున్నారు. అయినా సంబంధిత శాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక పంచాయితీ అధికారులు కనీసం అక్రమ వెంచర్ల పై విచారణ కూడా చేపట్టకోవడంతో అందరూ కలిసే ప్రజలను బకరా చేస్తున్నారా ..? అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నం అవడం సహజం. వాగులు సైతం రియల్టర్లు తమ వేంచర్లలో కలుపుకుని ప్లాట్లు విక్రయాలు జరుపుకుంటున్నారు. అంటే అధికారుల నిర్లక్ష్యానికి మరో ఉదాహరణ. ఓ పక్క ప్రభుత్వ ఆదాయానికి గండిపడటమే కాకుండా మరోపక్క ప్రభుత్వంపై అదనపు భారంతో పాటు రేపటి రోజు సామాన్యుడు అక్రమ వెంచర్ల ద్వారా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైనా అధికారులు ఇచ్చోడ మండల కేంద్రము తో పాటూ చుట్టుపక్కల గ్రామాలలో జరుగుతున్నటువంటి అక్రమ వెంచర్లపై కొరడ ఝులిపించకుంటే ఇలాంటి పరిణామాలు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు సామాన్యుడు ప్లాట్లు కోనుగోలు చేసి ఉంటే పరిస్థితి ఏమిటి.?
అక్రమ వెంచర్లకు సామాన్యుడు బలయ్యే ప్రమాదం కూడా అంతే ఉంది. ఏలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ఓ పక్క ప్లాట్లు విక్రయించడమే కాకుండా వివాదాస్పద భూములలో లే అవుట్లు తీసి సామాన్యులకు అంటగడుతున్నరనే ప్రచారం కూడా బయట నడుస్తుంది. కొన్నిసార్లు అయితే కార్పొరేషన్ ద్వారా పేదలకు పంపిణీ చేసినటువంటి భూములలో సైతం వెంచర్లు తీస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా అధికారులు స్పందించి అమాయక ప్రజలు నష్టపోకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలను ఇలా మాయమాటలు చెప్పి ఏలాంటి అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు విక్రయిస్తున్న వారిపై చట్టరీత్యా కట్టిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇచ్చోడ మండలం మార్కెట్ పరంగా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కావడంతో దాని చుట్టుపక్కల ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి వెంచర్లకు డిమాండ్ పెరిగి గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలే ఎక్కువగా ప్లాట్లు కొనుగోలు చేసుకుంటున్నారు.
అమాయక ప్రజలే వారి టార్గెట్….
అక్రమ వెంచర్ దారులకు పెద్ద ఆదాయ వనరుగా మారింది. గ్రామీణ ప్రజలకు ప్లాట్లు అమ్మి తమ బిజినెస్ ను పెంచుకునే ఒక సక్సెస్ దారిల వ్యవస్థను మార్చుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. పల్లె ప్రాంతాల్లో నివసించే ప్రజలే లక్ష్యంగా ఈ అక్రమ లేఔట్లలో ప్లాట్లను వారికి అంటగట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని వాదన కూడా వినిపిస్తుంది. అయినా కూడా జిల్లా స్థాయి ఉన్నత అధికారులు ఈవైపుగా కన్నెత్తి చూడకపోవడం గమనర్హం. ఇటు ప్రజలతో పాటు అటు ప్రభుత్వానికి ఆదాయానికి కూడ గండి పడుతున్న, ఖజానాకు రావలసిన సొమ్ము రాకపొగ ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్న అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు…!?
అధికారులు ఈ అక్రమ వెంచర్ల పై , వ్యాపారులపై ఈ ప్రేమను ఎందుకు వలకబోస్తున్నారు…!? వెంచర్ల పై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేయడానికి కారణం ఏమిటి..!? ఇది ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఈ వెంచర్లలో ప్లాట్ ల కొనుగోలుదారుల పరిస్థితి ఏమిటి? ఒకవేళ కొనుగోలు చేసి చేయకుంటే మంచిది ఒకవేళ చేసి ఉంటే కొనుగోలు చేసుకున్న వారి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అధికారుల యొక్క నిర్లక్ష్యం నిర్లక్ష్యానికి సామాన్యుడు బలి కాకా తప్పదా…?
ఒకప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడన్నా అవినీతి అక్రమాలు జరిగితే వాటి పై ఉక్కుపాదం మోపాలని చెప్పిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఎవరన్న అవినీతికి పాల్పడి లంచం అడిగితే చెప్పుతో కొట్టాలని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయినా అదిలాబాద్ జిల్లా అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం విస్తుగొలుపే విషయమే…!
గ్రామపంచాయతీ అడేగామ బి గ్రామపంచాయతీ పరిధిలో జరిగినటువంటి ఈ భూవివాదం చూస్తూ ఉంటే అసలు అధికారులకు హద్దులు తెలియకుండానే వెంచర్లకు అనుమతుల ఇచ్చేశారా.. ? ఒక వేళ అనుమతులు ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్ ప్లాట్లు అని ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారు…!?
వ్యక్తి ఫిర్యాదు చేసిన కూడా పక్కోడి భూమిని తన భూమిలో కలుపుకొని రోడ్లు సైతం వేసుకుని ప్లాట్లు అమ్మకాలు సైతం జరుపుకోవడం దానికి ఆ అధికారులు కూడా వత్తాసు పలకడం పలు అనుమాలకు తావిస్తోంది.
ప్లాట్లు కొనుగోలుదారులకు రిపబ్లిక్ హిందుస్థాన్ సూచించేది ఒక్కటే మీరు ఎక్కడైతే ప్లాటు కొంటున్నారో ఆ వెంచరు ప్రభుత్వ అనుమతి పొంది డిటిసిపి అప్రూవ్ అయి ఉందా…? నాలా కన్వర్షన్ అయి ఉందా…!? మరియు ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ సదరు లే ఔట్లలో అభివృద్ధి పనులు చేసి విక్రయాలు కొనసాగిస్తున్నారా..!? అదేవిధంగా గ్రామపంచాయతీకి కేటాయించాల్సిన భూమిని కేటాయించారా..!? ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని ప్లాట్లు కొనుగోలు చేయాలని రిపబ్లిక్ హిందుస్థాన్ సూచిస్తుంది. లేదంటే ఎవడు ఎప్పుడూ ఇది తన భూమి అని ప్లాట్లు లాక్కెలితే … మి కష్టార్జితం గాల్లో కలిసే అవకాశం వుంది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments