–పట్టణంలో పలుచోట్ల గుట్కాపై స్పెషల్ బ్రాంచ్ పోలీసుల దాడులు
— ఆరుగురు పై కేసు నమోదు,రూ.25 వేల విలువగల నిషేధిత గుట్కా స్వాధీనం…
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లాలో నిషేధిత గుట్కా నిర్మూలనే లక్ష్యంగా జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిఐ ఇన్స్పెక్టర్ జె కృష్ణ మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు గుట్కా విక్రయ ప్రాంతాల పై మెరుపు దాడులతో గుట్కా మాఫియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో రైల్వే స్టేషన్ పరిధిలో, ఠాకూర్ హోటల్ పరిధిలో పలు దుకాణాల్లో గుట్కా ఉందని విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన్నట్లు తెలిపారు.
తనిఖీ చేసిన పలు దుకాణాల్లో గుట్కా ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ. 25,000 వేలు విలువగల రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేయబడిన నిందితుల వివరాలు
1) అక్బర్ చాహుస్ s/o ఇసా చాహూస్ (29)
2) షేక్ రహీం s/o కుద్దిష్ (57)
3) షేక్ నయీమ్ s/o కాసిం (32)
4) షేక్ బషీర్ s/o చాంద్ (51)
5) సయ్యద్ మేహరజ్ s/o సాదిక్ (28)
6) షేక్ ఈజాస్ s/o రషీద్ (38)
వీరిని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకర్ నకు కేసు నమోదు కోసం అప్పగించడం జరిగింది అని తెలిపారు.
ఈ ఆపరేషన్లో స్పెషల్ బ్రాంచ్ ఎస్సై కె విట్టల్, సిబ్బంది చింధం దేవిదాస్, ఎండి జాకీర్, రాహత్, బి ఏసుదాస్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments