రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా లోని ఇచ్చోడ మండల కేంద్రంలో తరుచు ట్రాఫిక్ జామ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 140 ఫీట్లు విస్తీర్ణం కలిగిన రోడ్డు ఉన్న ఉపయోగంలో ఓ 16 ఫీట్లు రోడ్డు మాత్రమే కనిపిస్తుంది. కిరాణా షాపులు వద్ద పెద్ద పెద్ద వాహనాలు అపడంతో కూడా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. మండల కేంద్రంలో సిరికొండ మండలం వైపు వెళ్లే రోడ్డు పై కూడా ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారూ. అంబెడ్కర్ చౌరస్తా వద్ద కూడా దుకాణాల ముందర వాహనాలు నిలిపి ఉంచడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. స్కూల్ పిల్లలు కూడా ఈ ట్రాఫిక్ సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య ను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Recent Comments