డెంగ్యూ , టైపాయిడ్ వంటి రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నా ప్రజలు ….. డేంజర్ బెల్
రిపబ్లిక్ హిందూస్థాన్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు కోరాలుచాచుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చూసిన , చిన్న చిన్న ఆర్ఎంపీ దవాఖానాలు చూసిన వందల వేల సంఖ్యలో జ్వరం తో బాధపడుతున్నా వారు కనిపిస్తున్నారు. వాతావరణం లో మార్పుల తో పాటు అధికారుల నిర్లక్ష్య ధోరణి దీనికి కారణమని ప్రజలు వాపోతున్నారు. కరోనా నుండి కొలుకోకముందే డెంగ్యూ వంటి వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజా గా ఇచ్చోడా మండల కేంద్రంలో ఇద్దరు యుక్త వయసు యువకులు , , నెరడిగొండ లో ఒక ఎనిమిదేళ్ల బాలుడు డెంగ్యూ బారిన పడి మృత్యువాత పడ్డారు. ఏ మండలంలోని ఏ గ్రామం చూసిన వందల మంది జ్వరం తో మంచంపై పడీ ఉన్నారు.
ఆసుపత్రులలో చిన్న చిన్న పిల్లలకు ప్రమాదకర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నరూ.

ఇప్పకైనా జిల్లా యంత్రాంగం స్పందించి గ్రామాల్లో వైద్య బృందాలు పంపి వైద్య శిబిరాలు నిరవహించాలని కోరుతున్నారు.
నిర్మల్ జిల్లాలో సైతం డెంగ్యూ కేసులు ఎక్కువగానే నమోదు అవుతున్నట్లు సమాచారం.



Recent Comments