
ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రి ముందర వెలిసిన అక్రమ వెంచర్ లో గత వారం రోజుల క్రితం డిఎల్పిఓ ధర్మారాణి ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అనుమతులు లేనందున ఎవరు ప్లాట్లు కొనుగోలు చేయకూడదని, ఒకవేళ నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడితే నోటీసులు లేకుండా కూల్చివేస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు. అక్రమ వ్యాపారానికి అడ్డంకి గా మారిన ఆ నోటీసు బోర్డును వెంచర్ దారులు గుట్టచప్పుడు కాకుండా తొలగించారు.

ఇదే విషయం పై రిపబ్లిక్ హిందుస్థాన్ దినపత్రిక లో వార్త ప్రచురితమావడంతో ఇచ్చోడ గ్రామపంచాయతీ ఈఓ సూర్యప్రకాష్ తన సిబ్బందితో కలసి ఆ ప్రదేశం లో తిరిగి నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరైనా నోటీసు బోర్డ్ తొలగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


Recent Comments