మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని పూల మొక్క అందజేసి కలిసిన ఎస్సై…
ప్రతిక్షణం అప్రమత్తతో ఉంటూ విధులను నిర్వర్తించాలని సూచించిన జిల్లా ఎస్పీ…
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : శనివారం రోజు సాయంత్రం స్థానిక జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు నూతనంగా ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నందు బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఏ తిరుపతి జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ గారిని మర్యాదపూర్వకంగా పూల మొక్క అందజేసి బాధ్యతలను స్వీకరించడం జరిగింది. 2020 బ్యాచ్ కి చెందిన ఏ తిరుపతి బాసర జోన్ లోని నిర్మల్ జిల్లాలోని ముధోల్, జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్, జగిత్యాల్ పట్టణ ఎస్హెచ్వో గా విధులను నిర్వర్తించి ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నందు ఈరోజు ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. మంచిర్యాల దండేపల్లి మండలానికి చెందిన ఏ తిరుపతి 18 సంవత్సరాల పాటు ఆర్మీలో విధులను నిర్వర్తించి దేశానికి సేవలందించడం గర్వకారణం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇచ్చోడ మండలం జిల్లాలోని కీలకమైన పోలీస్ స్టేషన్లో ఒకటిని, అసాంఘిక కార్యక్రమాలకు ఎలాంటి అవకాశం లేకుండా సంపూర్ణంగా కట్టడి చేస్తూ, 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ విధులను నిర్వర్తించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగిన సందర్భంలోనైనా సంఘటనా స్థలాలకు నిమిషాలలో చేరుకునే విధంగా ప్రతిక్షణం పూర్తి సంసిద్ధంగా ఉండాలని తెలిపారు.
Recent Comments