Monday, July 14, 2025

ADB : రూ. 10వేలకు మైనర్ బాలికను అమ్మిన భార్యాభర్తలు అరెస్ట్

మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్
– అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి

* మైనర్ అమ్మాయిని రక్షించి కుటుంబ సభ్యులకు అందజేసిన జిల్లా పోలీసులు*
* ఆదివాసి మైనర్ అమ్మాయిను రాజస్థాన్ కు అమ్మిన నిందితులు (దంపతులు).
* భీంపూర్ పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై కేసు నమోదు.*
* మైనర్ బాలికను అమ్మిన భార్యాభర్తలు అరెస్ట్.*
* మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేసి నేరానికి పాల్పడిన దంపతులు.*
* మైనర్ అమ్మాయిని రాజస్థాన్లోని యువకుడికి అమ్మేసిన నిందితులు.*
* మైనర్ పై లైంగిక దాడి చేసిన రాజస్థాన్ యువకుని పై రేప్ మరియు పోక్సో కేసు నమోదు*
* మైనర్ అమ్మాయిని నమ్మిన దంపతులపై కిడ్నాప్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల నమోదు.*
* పదివేలకు మైనర్ అమ్మాయిని అమ్మేసిన దంపతులు.*
* ఒక సెల్ ఫోను రూ.2000 నగదు స్వాధీనం.*

*అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి వెల్లడించిన నిందితుల వివరాలు*

A1) కరణ్ @ భగవత్ మీనన్.
A2) నిర్మల బాపుణ్య ఆత్రం (47) W/o బాపుణ్య ఆత్రం, కిన్హి గ్రామం, ఘటంజి, యవత్ మాల్ జిల్లా, మహారాష్ట్ర.
A3) బాపుణ్య రాజారాం ఆత్రం(49) s/o రాజారాం ఆత్రం,కిన్హి గ్రామం, ఘటంజి, యవత్ మాల్ జిల్లా, మహారాష్ట్ర.

వివరాలలో…

శనివారం స్థానిక ఆదిలాబాద్ డిఎస్పీ కార్యాలయం నందు డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. బాధిత బాలిక పదవ తరగతి చదువుతోంది, ప్రస్తుతం ఆమె తన ఇంటిలో నివసిస్తోంది. ఆమె తల్లి బంధువుల ఇంట్లో ఉంటూ పెరుగుతోంది. 02-06-2025 ఉదయం, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో A2 మరియు A3 ఆమె ఇంటికి వచ్చి అబద్ధాలు చెప్పి ఆమెను తీసుకెళ్లారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని కిన్హిలో ఒక కార్యక్రమం ఉందని చెప్పి, A2 మరియు A3 ఆమెను ఆదిలాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడినుండి బస్సులో నాగ్‌పూర్‌కు తీసుకెళ్లారు. అక్కడినుండి ట్రైన్‌లో రాజస్థాన్‌లోని కోటకు తీసుకెళ్లారు. తర్వాత ఆమెను ఒక తెలియని గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను భయపెట్టి ఒక వ్యక్తి (A1 కరణ్ @ భగవత్)కి అప్పగించడం జరిగింది.

A2 & A3 లు కరణ్ @ భగవత్ వద్ద నుండి రూ.10,000/- తీసుకున్నారు. ఆ తర్వాత కరణ్ @ భగవత్ ఆమెను తన ఇంటిలో అక్రమంగా నిర్బంధించి, పలు మార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆమె మామ (తల్లి బంధువు) పలువురు బంధువుల ఇళ్లలో ఆమెను వెతికారు. చివరికి 22వ తారీఖున బీంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం కరణ్ కు నిర్మల (A2) ద్వారా విషయం తెలిసింది. 23-06-2025న కరణ్ బాధిత బాలికను నిర్మలకు అప్పగించాడు.

వారు ట్రైన్‌లో ఆదిలాబాద్‌కు వచ్చారు. 25-06-2025న బాధిత బాలిక తన ఇంటికి వచ్చింది. కరణ్ కు ఇదివరకే పెండ్లి అయి విడిపోవడం జరిగిందని విచారణలో తెలిసిందని ఆదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితులను ఈరోజు ట్రైన్ మార్గంలో ఆదిలాబాద్ నుండి  పారిపోతుండగా రైల్వే స్టేషన్ నందు పట్టుకోవడం జరిగిందని తెలిపారు.

నిందితుల వద్ద నుండి ఒక సెల్ ఫోను, 2000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జైనత్ సీఐ డి సాయినాథ్, బీంపూర్ ఎస్సై బి పీర్ సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

( Video) వివరాలు వెల్లడిస్తున్న అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి