Friday, June 13, 2025

పారదర్శకంగా హోంగార్డుల బదిలీ ప్రక్రియ పూర్తి – జిల్లా ఎస్పీ

◾️ జిల్లాలో వందమంది హోంగార్డుల బదిలీ

◾️62 మంది నిర్మల్, 38 మంది కొమురం భీమ్ ఆసిఫాబాద్ కు బదిలీ

◾️లక్కీ లాటరీ ద్వారా బదిలీ ప్రక్రియలో అదృష్టాన్ని పరీక్షించుకున్న హోంగార్డులు

◾️హోంగార్డుల బదిలీ ప్రక్రియను నిర్వహించిన జిల్లా ఎస్పీ…

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఆదిలాబాద్ జిల్లాలో హోంగార్డుల బదిలీ ప్రక్రియను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా పూర్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా నందు ప్రతి సంవత్సరం హోంగార్డుల బదిలీ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నిర్మల్ జిల్లా నుండి 62 హోంగార్డులు అదేవిధంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుండి 38 మంది హోంగార్డులు ఆదిలాబాద్ జిల్లాకు రానుండగా వారి స్థానంలో ఆదిలాబాద్ జిల్లా నుండి మొత్తం 100 మంది హోంగార్డులను లక్కీ లాటరీ విధానం ద్వారా బదిలీ ప్రక్రియను నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో సాధారణ విధులు నిర్వర్తించే హోంగార్డులు, వాహన డ్రైవర్స్, దోబీలు, వంట పని చేసే వారు, వివిధ రంగాలలో విధులు నిర్వహిస్తున్న మొత్తం 115 మంది హోంగార్డులు బదిలీ ప్రక్రియలో పాల్గొనగా, 100 మంది నిర్మల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలకు 15 మంది ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించినట్లు తెలియజేశారు. బదిలీ ప్రక్రియను అందరూ హోంగార్డుల నడుమ పారదర్శకంగా ఎటువంటి అపోహలు లేకుండా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు యస్ శ్రీనివాసరావు, బి రాములు నాయక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, ఎం వంశీకృష్ణ, జి వేణు, కే కిరణ్ కుమార్, ఏ రామకృష్ణ పోలీసు కార్యాలయం సిబ్బంది సూపర్ ఇండెంట్లు శంకరమ్మ, సంజీవ్, గంగాధర్, సిబ్బంది రిజ్వానా బేగం, దయానంద్, షామిలి, హోంగార్డ్ యూనిట్ అధికారులు రమేష్, రిజర్వు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి