రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి ఆవరణలో గల టి హబ్ ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిపోర్ట్ లు ఎలా ఇస్తున్నారు. రిపోర్టులలో కొన్ని తప్పులు వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని మేనేజర్ హరీష్ ను అడిగి తెలుసుకున్నారు. ఒకేసారి ఒక్కొక్క పరికరంలో ఎన్ని ఘట్ట పరీక్షలు చేస్తారని ఎంత టైం లో రిపోర్ట్ లు వస్తాయని అడిగి తెలుసుకున్నారు. రిపోర్టులు ఎవరు కలెక్ట్ చేస్తారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ మేనేజర్ హరీష్ ను అడిగారు .. మేనేజర్ మైక్రో బయాలజీ నుంచి ఒక వైద్యులు వస్తారని ఉదయం 10 గంటలకు సాయంత్రం వచ్చి రిపోర్టులు కలెక్ట్ చేశారని చెప్పారు. సిబ్బంది ఎవరెవరు పని చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు అందుకు అక్కడ పనిచేస్తున్న వారు ల్యాబ్ టెక్నీషియన్ల ల్యాబ్ అటెండర్ ల అని అడిగారు అందుకు మేనేజర్ వారు ల్యాబ్ అటెండర్ లో అని చెప్పారు మరి ల్యాబ్ టెక్నీషియన్లు ఎందుకు రాలేదని ల్యాబ్ టెక్నీషియన్లు ఉండాలి కదా అని చెప్పారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వెంట వేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, టీ హబ్ మేనేజర్ హరీష్ తదితరులు ఉన్నారు.
Recent Comments