రూ 1 లక్ష విలువ గల నిషేధిత గుట్కా స్వాధీనం
గుట్కా నిలువ ఉంచిన,రవాణా చేసిన వారిపై ఉక్కుపాదం
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : సోమవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సూచించిన గుట్కా పై ఉక్కుపాదం మోపాలని చెప్పిన ఆదేశాల మేరకు ఎస్బీ ఇనస్పెక్టర్ జె కృష్ణమూర్తి గారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇచ్చోడ పట్టణం లో టి అశోక్ షాప్ మరియు గోడౌన్ లో తనిఖీ చేయగా రూ 1 లక్ష విలువైన రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గుట్కా లభించిందని తెలిపారు,లభించిన గుట్కా ను ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఉదయ్ కుమార్ కు కేసు నమోదు కోసం అప్పగించినట్లు తెలిపారు, జిల్లాలో ఎటువంటి గుట్కా, మట్కా, జూదం నకు సంబందించిన సమాచారాన్ని ఎస్బి ఇనస్పెక్టర్ అయిన తనకు అందించాలని,తన సెల్ ఫోన్ నంబర్ 9490619548 అని తెలిపారు. ఈ ఆపరేషన్ లో ఎస్బీ ఎస్ఐలు ముజాహిద్,విఠల్ ,ఇచ్చోడ, గుదిహత్నూర్ ఎస్బి కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments