Tuesday, October 14, 2025

గ్రిల్ నైన్ హోటల్ లో …  ఫుడ్ పాయిజన్ వల్ల మహిళ మృతి…



*ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను వినియోగించరాదు – ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి.*

*ప్రభుత్వ నిషేధించిన ఫుడ్ కలర్స్ లను వాడకూడదు.*

*పట్టణంలోని పలు హోటల్లు రెస్టారెంట్లు యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన ఆదిలాబాద్ డిఎస్పి.*

*నిర్మల్ గ్రిల్ నైన్ హోటల్ యాజమాన్యంపై బోథ్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు.*

రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :
నవంబర్ రెండవ తారీఖున రాత్రి సమయంలో నిర్మల్ గ్రిల్ నైన్ హోటల్ నందు ఆహారాన్ని తిని బోథ్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అయిదుగురు అస్వస్థకు గురై ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ ఈరోజు ఆ పాఠశాల కుక్ (మహిళ) ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన సంఘటన చోటచేసుకుంది.

Thank you for reading this post, don't forget to subscribe!

పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు నిర్మల్ పట్టణం గ్రిల్ నైన్ యాజమాన్యం మరియు సిబ్బందిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని పలు హోటల్లు రెస్టారెంట్ల యాజమాన్యాలతో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నందు సమావేశం నిర్వహించి పాటించవలసిన నియమాలపై సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ డిఎస్పీ మాట్లాడుతూ కుల్లిన పదార్థాలను, ఎక్స్పైరీ అయిపోయిన పదార్థాలను వంటల నందు వినియోగించరాదని తెలియజేశారు.

వినియోగించిన ఆయిల్ ను ఎక్కువసార్లు వినియోగిస్తూ ఉండరాదని, ప్రతి సందర్భంలో ఆయిల్ ను మారుస్తూ ఉండాలని సూచించారు. ప్రభుత్వం నిషేధించిన ఫుడ్ కలర్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వంటకాలలో వినియోగించకూడదని సూచించారు. హోటల్స్ రెస్టారెంట్లు నందు పరిశుభ్రతను, స్టాండర్డ్స్ ను  క్రమం తప్పకుండా నిర్వహించాలని తెలిపారు. ఆహార పదార్థాల పట్ల నాణ్యత ప్రమాణాలను పాటించాలని తెలియజేశారు. యాజమాన్యాలు ప్రతిరోజు సిబ్బంది కి మరియు వంట చేసే వ్యక్తులకు పరిశుభ్రతపై, పదార్థాల నాణ్యత పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అవగాహనను కల్పించాలని తెలిపారు. 

వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఎలాంటి క్రిములు కీటకాలు సంచరించకుండా, ఆహార పదార్థాలను తగు జాగ్రత్తలతో నిలువ చేస్తూ ఉండాలని సూచించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఎలాంటి వస్తువులను, కుళ్ళిన పదార్థాలను, వంటకాలను ఫ్రిడ్జ్ ల నందు నిలువ చేస్తూ వినియోగించరాదని తెలిపారు. యాజమాన్యాలకు ప్రజలకు అందించి ఆహార పదార్థాల నాణ్యత పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ సునీల్, రెండవ పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సైలు అశోక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!