అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం (APMS) జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్ : ఏజెన్సీ ప్రాంతం లో తరాతరాల నుండి నీవశిస్తున్న దళితుల భూములకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి ఇప్పటికి ఏజెన్సీ ప్రాంత దళితుల కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లో కల్పించిన ప్రాథమిక హక్కులు కూడా వర్తించక పోవడం అనేది దళితులు చేసుకున్న దార్భాగ్యమో అర్థం కావడం లేదని అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం (APMS) జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ అన్నారు.
ఇదే మట్టిలో పుట్టి ఇదే మట్టిలో కలసిపోతున్న గాని ఏజెన్సీ దళితులకు అందని ద్రాక్ష లాగా మిగిలి పోతుందే గాని హక్కులు మాత్రం అనుభవించడం లేదని , ఎన్ని ప్రభుత్వలు మారిన గాని ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న దళితుల ఏజెన్సీ తలరాతలు మారడం లేదు ఎన్ని తరాలు మారితే దళితుల తలరాతలు మారుతాయో! తెలియని పరస్థితి ఉందని అన్నారు. ఏజెన్సీ దళితులకు ప్రభుత్వం ప్రకటించిన రైతు బందు, రైతు భీమా పథకాలు అందక అయోమయం లో ఉంటే ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ అవసరాలకు మాత్రం దళితుల భూములు లక్కోవడం ఏజెన్సీ దళితులకు పుండు మీద కారం చెల్లినట్టుగా వుంది.
ఇలా చేస్తే మాత్రం దళితుల అగ్రహానికి గురికాక తప్పదు దళితులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వలుకూడా పాలించిన చరిత్ర లేదు ఇకనైనా ప్రభుత్వం మనవీయ కోణంతో అలోచించి ఏజెన్సీ దళితుల యొక్క భూములకు రక్షణ కలిపించి ధరణి లో పేర్లు నమోదు చేయడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వనికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండుగుల మహేష్ సిర్పూర్ ఉ మండల నాయకులు సుద్దాల ఆనంద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments