గంజాయి పట్టుకున్న ఎక్సయిజ్ అధికారులు, సిబ్బంది
,దేవుల నాయక్ తండా వద్ద 325 గ్రాముల డ్రై గంజాయి పట్టివేత.
రిపబ్లిక్ హిందూస్తాన్,బజార్ హత్నూర్ :
దేవులతండా (రోళ్లమామడ ) గ్రామంలో ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్నట్టు పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జాఫర్ అహ్మద్, సిబ్బంది కల్సి దేవులతండాలో తనిఖీలు గురువారం రోజు ఉదయం 11గంటల ప్రాంతంలో నిర్వహిస్తుండగా జాతవే మన్సింగ్ని పట్టుకొన్నారు.ఆయన ఇంటి ముందర సుమారు 325 గ్రాముల డ్రై గంజాయి లభించిందని ఎక్సయిజ్ అధికారులు తెలిపారు జాతీవే మన్సింగ్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించి నట్టు ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జుల్ఫీకర్ అహ్మద్ చెప్పారు. ఎవరైనా గంజాయి అమ్మిన, కలిగి ఉన్న, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు
Recent Comments