స్మగ్లర్లను పట్టుకొని ముఠా గుట్టురట్టు చేసిన అదిలాబాద్ జిల్లా పోలీసులు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : భారీ మొత్తంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నా ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
స్మగ్లర్ల నుండి పెద్దమొత్తంలో గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి…..
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నిందితులు A5) మహమ్మద్ సద్దాం ఖాన్, తండ్రి, ఆజాం ఖాన్,వయస్సు 27 సంచాలు, ముస్లిం, వృత్తి, చికెన్ సెంటర్,నివాసం మొబిన్ పుర ఉట్నూర్.
A6) రెహ్మాన్ ఖాన్, తండ్రి యూనుస్ ఖాన్, వయస్సు 23 సం.రాలు ముస్లిం, వృత్తి మెకానిక్, నివాసం నవోదయ నగర్ ఉట్నూర్.
A7) పవార్ రాజు@ రాజేష్, తండ్రి, అశోక్, వయస్సు 25 సం.రాలు, కులం లంబాడా, వృత్తి డ్రైవెర్, నివాసం కొత్తగూడెం చెక్ పోస్ట్ ఉట్నూర్.
A8) రాథోడ్ శ్రీకర్, తండ్రి, హీరామన్. వయస్సు 21 సం.రాలు, కులం లంబాడా, వృత్తి డ్రైవర్, నివాసం శాంతి నగర్ ఉట్నూర్.
*పారిపోయిన నిందుతుల వివరాలు…*
A1) పూజారి వెంకటేష్, తండ్రి పెద్ద కన్నయ్య నివాసం, గోండుగూడ జన్నారం.
A2) మహమ్మద్ సద్దాం హుస్సేన్, తండ్రి ముఖ్బూల్ అహ్మద్, 27 సం.రాలు ముస్లిం, వృత్తి, డ్రైవర్ నివాసం లక్కారం, ఉట్నూర్.
A3) మహేష్, నివాసం కళ్ళెడ కడెం మండలం, నిర్మల్ డిస్ట్రిక్ట్.
A4) గవాలే తుకారం, నివాసం వేణు నగర్ ఉట్నూర్.
*స్వాధీనం చేసుకున్న వివరాలు*
92 కేజీల 132 గ్రాముల గంజాయి.
రెండు ఏర్టిగా కార్లు,
4 మొబైల్ ఫోన్లు.
*కేసు వివరాలు.*
ఉట్నూర్ కు చెందిన రహ్మన్ ఖాన్, పవార్ రాజు @ రాజేష్, రాథోడ్ శ్రీకర్, సద్దాం ఖాన్, గావాలి తుకారం, సద్దాం హుస్సేన్ లు జన్నారం కు చెందిన వెంకటేష్, కల్లెడ గ్రామానికిచెందిన మహేష్ లు స్నేహితులు, వీరందరూ జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో గంజాయి సరఫరా చేయడం లేదా అమ్మడం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించవచ్చని తెలుసుకోని ఆంధ్ర, ఒరిస్సా, బోర్డర్ సమీపంలో గంజాయి చవకగా లభిస్తుందని తెలుసుకొని అక్కడికి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి తక్కువ ధరకు గంజాయి పాకెట్స్ లను కొనుగోలు చేసి మహారాష్ట్ర లోని వివిధ ప్రాంతాలలో ఎక్కువ ధరకు అమ్ముతూ లాబాలు పొంది వాటిని పంచుకుంటున్నారు. ఎప్పటిలాగే వీరందరూ వారం క్రితం సీలేరు ప్రాంతం వెళ్లి అక్కడ 110 గుజుయి ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్ 2 జిల్లా చొప్పున) ఓక్కొక కిలో గంజాయి . -4-4000 రూపాయలకు కొనుగోలు చేసి అక్కడ నుండి గంజాయి ని తీసుకొని వచ్చి ఉట్నూర్ లోని, తుకారాం (A4) ఇంట్లో నిల్వ ఉంచిన్నారు. ఆ తర్వాత మూడు రోజులకు వెంకటేష్ (A1), సద్దాం హుస్సేన్ (A2), మహేష్ (A3) లు కలిసి గంజాయి ప్యాకెట్లను మహారాష్ట్ర లోని ఆమరావతి తీసుకెళ్ళి అక్కడ అధిక ధరకు అమ్మి లాభం పొందారు. ఆ తర్వాత నిన్న అనగా తేది: 22.02.2023 వ రోజున మిగిలిన 44 ప్యాకెట్లను కూడా మహారాష్ట్ర లోని పుసద్ తీసుకెల్లి అమ్మాలని నిర్ణయించుకొని వీరందరూ కలిసి 2 ఎర్టిగా కార్లలో ఉట్నూర్ నుండి నాగుల బైపాస్ మీదుగా మహారాష్ట్ర వైపునకు వెళుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు అదిలాబాద్ ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మావల మరియు సిసిఎస్ పోలీసులు ఆధ్వర్యంలో మావల బైపాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గుడియత్నూరు వైపు నుండి రెండు ఎర్టిగా కార్లు ( Ap01ag 5157,ts01fg1382) లు అనుమానాస్పదంగా రావడం గమనించిన వారిని ఆపే క్రమంలో నలుగురు వ్యక్తులు కార్ల నుండి దిగి పారిపోగా మిగిలిన నలుగురిని పట్టుకొని వాహనాలను తనిఖీ చేయగా 44 గంజాయి ప్యాకెట్లు రెండు వాహనాలల్లో లభించాయని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. వెంటనే ఇద్దరు రెవెన్యూ పంచులు ఆదిలాబాద్ ట్రాఫిక్ సిఐ గారి సమక్షంలో నిందితులను విచారించి వారి పేర్లు తెలుసుకొనగా వారు పైన పేర్కొన్న వివరాలు తెలియజేశారు. వెంటనే 44 గంజాయి ప్యాకెట్లను తూకం చేయగా 92 కిలోల 132 గ్రాముల అని తేలింది. దీని విలువ దాదాపు 9,20,000 ఉంటుందని తెలిపారు. అట్టి స్వాధీనం చేసుకున్న రెండు కార్లు నాలుగు మొబైల్ ఫోన్లో మరియు 44 గంజాయి ప్యాకెట్లను జప్తు చేసి ఎందుకూలను మరియు పట్టుకున్న సొత్తును మావల పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని. క్రైమ్ నెంబర్ 35/2023, U/ sec 20(b)(ii)(c) ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణను కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పత్రిక సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పి వి ఉమేందర్, సిఐలు బి రఘుపతి, ఈ చంద్రమౌళి, మావల ఎస్ఐ విష్ణువర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments