వరదలో చిక్కున వారిని రక్షించిన అధికారులు….
రిపబ్లిక్ హిందూస్థాన్, సిరికొండ /ఇచ్చొడ :
ఇచ్చోడ మండలం నారాయణపుర్ కు చెందిన ఒక వృద్ధుడు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే ప్రయత్నం చేయగా వాగులో ప్రవాహానికి కొట్టుకుపోయిన సంఘటన జరిగింది…. అయితే అతనికి ఈత రావడంతో ఈదుకుంటు ఒడ్డుకు కు చేరాడు.
ఇచ్చోడ, సిరికొండ మండలల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సిరికొండ మండలంలో ఎగువ కురిసిన భారీ వర్షానికి చిక్ మాన్ వాగు పొంగి పొర్లుతుంది. అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. సిరికొండ మండల కేంద్రానికి చెందిన నలుగురు పశువుల కాపరులు ఉదయం గొర్లను మేపడనికి గ్రామ శివరంలో ఉన్న అటవీ ప్రాంతంలో వెళ్లారు ఇంటికి తిరిగి వస్తుండగా ఎగువ కురిసిన భారీ వర్షానికి చిక్ మాన్ వాగు పొంగి పొర్లడంతో వాగు దాటే క్రమంలో వరద ఉధృతి ఎక్కువ కావడంతో నలుగురు పశువుల కాపరులు వాగులో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్థానిక ఎమ్మార్వో కు సమాచారం తెలపడంతో వెంటనే ఎమ్మార్వో చేరుకొని గజ ఈతగాళ్ల సహయం తీసుకొని తాడు సహాయంతో నలుగురు పశువుల కాపరులను కాపాడారు. నలుగురు పశువుల కాపరులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.



Recent Comments