
• చట్ట వ్యతిరేకంగా జాతీయ రహదారిపై వాహనాలను ఆపి, పోలీసు విధులకు ఆటంకపరచిన వ్యక్తులు
• పోలీసులతో దురుసుగా ప్రవర్తించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులు
• నేరడిగొండలో జాతీయ రహదారి దిగ్బంధనం, పోలీసులపై దాడి – 9 మంది పై కేసు నమోదు
ఆదిలాబాద్ / నేరడిగొండ : గత నెల 27 వ తారీఖున నేరేడుగొండ మండలం నందు రోడ్డుపై బైఠాయించి పోలీసు విధులను ఆటంకపరిచిన
నిర్మల్ జిల్లా మామడ మండలంలోని గాయిద్ పల్లి గ్రామానికి చెందిన ఏ2) జాదవ్ ప్రేమ్‌సింగ్ (47) , ఏ3) ఇందల్ ఇస్లావత్ (33) , ఏ4) బ్రహ్మావత్ అరవింద్ (22) , ఏ7) జాదవ్ లక్ష్మణ్ (38) తొమ్మిది మందిపై కేసు నమోదు నలుగురి అరెస్ట్ రిమాండ్ తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.
ఈ కేసు సంబంధించిన వివరాలు…..
గత నెల 26వ తారీఖున ఆదిలాబాద్ జిల్లా నందు గల నేరడిగొండ మండలంలో జాతీయ రహదారి 44 (NH44)పై రాస్తారోకో నిర్వహించి, పోలీసులపై దాడి చేసిన ఘటనలో కేసు నమోదైంది. ఈ ఘటన నందు నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని, నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI)గా పనిచేస్తున్న ఎం. రామకృష్ణ (ASI-4259) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. జూన్ 26, 2025న రాత్రి 08:45 గంటల సమయంలో ASI రామకృష్ణ, కానిస్టేబుల్ జి. సంతోష్ (PC-3318)తో కలిసి నేరడిగొండలోని NH44 రోడ్డుపై స్థానిక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో, నీలిమ దాబా సమీపంలో, నిర్మల్ జిల్లా మామడ మండలం, గాయడ్‌పల్లి గ్రామానికి చెందిన కాలా బాయి, ప్రేమ్ సింగ్ మరియు మరికొందరు స్త్రీ, పురుషులు రెండు ఐషర్ వాహనాలలో వచ్చారు.
వారి గ్రామానికి చెందిన అడే సుజాత (భర్త: నటరాజ్, వయస్సు: 26 సం.) అనే మహిళను ఆమె భర్త, బంధువులు వేధింపులతో చంపారన్న ఆరోపణపై వారు NH44 రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి, అల్లర్లు సృష్టించారు. తక్షణమే ASI రామకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, NH44 రోడ్డు దిగ్బంధనాన్ని ఆపడానికి ప్రయత్నించారు. దీనివల్ల సాధారణ ప్రజలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఫిర్యాదుదారుడు మరియు ఇతర పోలీసు సిబ్బంది వారిని సముదాయించడానికి ప్రయత్నించినప్పటికీ, వారు పోలీసుల సూచనలను పాటించలేదు మరియు వారి విధులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో, వారిలో కొందరు పోలీసుల చుట్టూ చేరి, కర్రలతో ASI రామకృష్ణ, కానిస్టేబుల్ జి. సంతోష్‌పై దాడి చేసి గాయపరిచారు. ఘటనను వీడియో రికార్డు చేస్తుండగా PC-3318 జి. సంతోష్ మొబైల్ ఫోన్‌ను కూడా ధ్వంసం చేశారు. అంతేకాకుండా, పోలీసులను చంపేస్తామని బెదిరించారు.
ఫిర్యాదుదారుడు గాయపడటం జరిగింది.
ఈ ఫిర్యాదులోని అంశాల ఆధారంగా, పోలీసులు క్రైమ్ నంబర్ 133/2025 కింద భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 127(2), 132, 121(1), 351(3) రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించి, ఎఫ్‌ఐఆర్ కాపీని జారీ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈరోజు నలుగురు ముద్దాయిలను ఉట్నూర్ కోర్ట్ నందు ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడిసరి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. చట్టం వ్యతిరేక కార్యక్రమాలు పోలీసు విధులను ఆటంకపరిచేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Four arrested for obstructing police duties, remanded – District SP Akhil Mahajan IPS
• Persons who illegally stopped vehicles on the national highway and obstructed police duties.*
Recent Comments