చేపల వేటకు వెళ్లి చేపల కోసం వేసిన వల కాలికి తట్టుకొని ఓ వ్యక్తి మృతి చెందిన సిరికొండ మండలం లో చోటుచేసుకుంది. సిరికొండ ఏఎస్సై ఆర్ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం వాయిపేట గ్రామానికి చెందిన సిపెల్లి ఎర్రన్న మరియు రాథోడ్ గణేష్ ఇద్దరు మిత్రులు. శనివారం రోజు సిపెల్లి ఎర్రన్న సిరికొండ మండల కేంద్రానికి వెళ్లి పింఛన్ డబ్బులు తీసుకోని ఇంటికి వచ్చాడు. అయితే కొంతసేపటికి రాథోడ్ గణేష్ సిపెల్లి ఎర్రన్న ను చేపలు వెళ్దామనడంతో, ఇద్దరు కలిసి చీమన్గుడి గ్రామ శివారులో ని వాగులో చేపలు పడుతుండ గా మృతుడు సిపెల్లి ఎర్రన్న (65) కాలికి చేపల వల తట్టుకోవడం తో నీటిలో మునిగిపోయి చనిపోయినట్లు ఫిర్యాదు వచినట్లు తెలిపారు . ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!ప్రాణం తీసిన చేపల వల ….
- Advertisment -
Recent Comments