రిపబ్లిక్ హిందూస్థాన్, బేల : బ్యాంక్ అధికారుల వేధింపులతో ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంకులో పురుగుల మందు తాగి రైతు జాదవ్ దేవరావు మృతి చెందడం బాధాకరమని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం బేల మండలం రేణు గూడా గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపారు.రైతు ఆత్మహత్య సంఘటనకు బ్యాంకు అధికారులే బాధ్యత వహించాలని అన్నారు.విషయాన్నీ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని,ప్రభుత్వపరంగా బాధిత రైతు కుటుంబానికి అందాల్సిన పరిహారం వెంటనే అందేలా చూస్తామని కుటుంబ సభ్యులకు శ్రీకాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. మావల మండల అధ్యక్షుడు ధర్మపురి చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేముల నాగరాజ్, నాయకులు సామ రూపేష్ రెడ్డి,నలిమెల నవీన్ రెడ్డి, ఇర్ఫాన్, అభిబ్,అలీమ్ తదితరులు వున్నారు.
Recent Comments