రిపబ్లిక్ హిందుస్థాన్, సిరికొండ : అప్పుల భాద భరించలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిరికొండ మండలంలోని చీమన్ గుడి గ్రామం లో చోటుచేసుకుంది.
సిరికొండ ఎస్సై పి నీరేష్ తెలిపిన వివరాల ప్రకారం సిరికొండ మండలం చీమన్ గూడి గ్రామానికి చెందిన జాదవ్ ప్రేమ్ (45) తనకు గల 2.8 ఎకరాల స్వంతా భూమితో పాటు మరో 7 ఎకరాల భూమిని కౌలు కు తీసుకోని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ సంవత్సరం వర్షాకాలం లో కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతినడంతో పంట దిగుబడి రాలేదు. పంట దిగుబడి రాక, కుటుంబ పోషణ భారమై, పంట పెట్టుబడి కోసం చేసిన నాలుగు లక్షల రూపాయల అప్పులు ఎలా తీర్చాలో అని బాధపడే వాడు. ఆదివారం రోజు వ్యవసాయ పనుల కోసం ఇంటి నుండి వెళ్లి, పంట పొలంలోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు 108 అంబులెన్సు లో తరలించారు. రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి ఇద్దరు భార్యలు, ఐదు గురు కొడుకులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Recent Comments