రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : అప్పుల బాధతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని లెంకలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. నల్లబెల్లి ఎస్ఐ ఎన్ రాజారాం కథనం ప్రకారం లెంకలపల్లి గ్రామానికి చెందిన కన్నం సాంబయ్య వయసు (51) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల్లో మిరప మొక్కజొన్న పంటలు సాగు చేయగా అ ఆ ఇ ఈ మధ్య కురిసిన వడగళ్ల వర్షానికి మొత్తం పంట ధ్వంసమై ఐదు లక్షల వరకు నష్టం వాటిల్లడంతో అప్పులు ఎలా తీర్చాలనే మనస్థాపంతో తన ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు లో ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య కన్నం లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Recent Comments