— మరో ప్రధాన నిందితుడు బండి రమేష్ వద్ద నుండి 29 లక్షల రూపాయలు స్వాధీనం
— వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
బేలా ఎడిసిసి బ్యాంక్ లో జరిగిన కుంభకోణం పై
శనివారం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎడిసిసి బ్యాంక్ బేల బ్రాంచ్ లో జరిగిన రూ.2. 85 కోట్ల కుంభకోణంలో తేదీ 13.3.20202 రోజున ఎడిసిసి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అయినా గడ్డం శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లిఖితపూర్వకంగా పిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఎడిసిసి బ్యాంక్ బేలా బ్రాంచ్ రూపాయలు 2,85,00,000 అక్రమంగా ఎలాంటి వోచర్లు లేకుండా తారుమారు అయినట్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదివరకే తేదీ 19.03.2022 రోజున A1- శ్రీపతి కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.

శ్రీపతి కుమార్ తన మరియు అతడి కుటుంబ సభ్యుల అకౌంట్స్ ల నుండి వచ్చిన డబ్బుల నుండి బండి రమేష్ యొక్క అకౌంట్ ల లోకి 1,38,57,500/- ట్రాన్స్ఫార్మర్ చేసినాడు. అందులో నుండి అతను వివిధ తేదిలలో శ్రీపతి కుమార్ కు 40,03,000/- తిరిగి ఇచ్చినాడు. మిగితా 98,54,500/- నుండి 46,63,000/- బ్యాంకు లో అతను జమ చేయించడం జరిగింది. , బ్యాంకు వారు రూపాయలు 5,89,000/- బండి రమేష్ అకౌంట్ లో సీజ్ చేయడం జరిగింది.అతను దాదాపు 17,00,000/- అవసరాలకు వాడుకుని జల్సాలకు పాల్పడ్డాడు.
అతను కోర్ట్ కు వెళ్ళాడనికి, ఆదిలాబాద్ బస్టాండ్ లో ఉండగా మా పోలీస్ వారికి సమాచారం రాగ అతనిని పట్టుకుని అతని దగ్గర రూపాయలు 29,00,000/- డబ్బులను స్వాదినం చేసుకున్నామని తెలిపారు.
అదేవిదంగా వై రానిత అసిస్టెంట్ మేనేజర్ బేలా మరియు రాహుల్ స్టాఫ్ అసిస్టెంట్ బేలా ను కూడా వారి యొక్క డ్యూటీ నేగ్లిజేన్సి మరియు వారి అంతేంటికేషన్(authentication) దుర్వినియోగం చేసినందుకు వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఎస్పి ఎంఎస్వి వెంకటేశ్వరరావు, జైనథ్ సిఐ కోళ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments