• వివరాలను వెల్లడించిన రూరల్ సిఐ కె ఫణిదర్
ఆదిలాబాద్ : వివరాలలోకి వెళితే బేల మండలం రేణుగుడ గ్రామానికి చెందిన జాదవ్ దేవరావ్ గఅనే వ్యక్తి 2019 సంవత్సరంలో ఐసిఐసిఐ బ్యాంకు అదిలాబాద్ లో తన ఐదు ఎకరాల పొలాన్ని మాడిగేజ్ చేసి, కిసాన్ క్రెడిట్ మాడిగేజ్ లోన్ 3,40,000 రుణాన్ని తీసుకున్నాడు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ రుణాన్ని చెల్లించవలసి ఉంటుంది. చివరి వడ్డీ 2024 మే నెలలో చెల్లించడం జరిగింది. అక్టోబర్లో చెల్లించాల్సిన వడ్డీ చెల్లించలేదు. దీనికై బ్యాంక్ అధికారులు ప్రతిసారి ఫోన్ చేయడంతో మనస్థాపానికి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని జాదవ్ దేవరావ్ కొడుకు ఆకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన మావాల పోలీసులు ఐసిఐసిఐ బ్యాంకు వెళ్లి అక్కడ బ్యాంక్ మేనేజర్ ను మరియు బ్యాంక్ సిబ్బంది విచారించగా జాదవ్ దేవరావు బ్యాంకులో రుణం తీసుకున్న వాస్తవమేనని అయితే అతనికి వడ్డీ చెల్లించాలని బ్యాంకు నుండి గాని మా సిబ్బంది నుండి గాని ఎలాంటి ఒత్తిడి తెలియదని అదేవిధంగా మా యొక్క బ్యాంకు డిఫాల్ట్ లిస్టులో కూడా అతని పేరు లేదని అతని ఇంటికి గాని అతనికి గాని బ్యాంకు వడ్డీ కట్టవలసిందిగా ఏలాంటి వేధింపులకు పాల్పడలేదని తెలిపారు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సిసి కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా జాదవ్ దేవరావు అనే వ్యక్తి మోనోసిల్ అనే పురుగుల మందు బాటిల్ ను ముందుగానే తీసుకొని వచ్చి బ్యాంకు బయట తాగి, తర్వాత లోపలికి వచ్చి తాగినట్లు రికార్డు అయినది. విచారణలో జాదవ్ దేవరావ బ్యాంక్ కి వచ్చిన తర్వాత బ్యాంక్ అధికారులతో కానీ అక్కడ సిబ్బందితో మాట్లాడినట్టుగాని, వాగ్వాదం చేసుకున్నట్లు గాని జరగలేదు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయని కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు అతని భార్య కు కిడ్నీ సమస్య వంటి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసింది. జాదవ్ దేవరావు కొడుకు ఆకాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు జరిగిన విచారణలో బ్యాంక్ అధికారుల ఒత్తిడి ఉన్నట్లు తేలలేదు, అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని కోణంలో పోలీసులు పూర్తి విస్తాయి విచారణ చేపడుతున్నట్లు రూరల్ సీఐ కె. ఫణిదర్ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం బ్యాంకు అధికారులపై చేసిన ఆరోపణలు నిజమైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు.
Recent Comments