— పంట దిగుబడి అప్పులపాలయి
— మానసికంగా కృంగిపోయి మతిస్థిమితం కోల్పోవడం తో ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స సైతం చేయించుకున్న వైనం….
— ఇచ్చోడా మండలం లో కొకస్ మన్నూర్ లో విషాదం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అరుగాలం కష్టపడినా ఆశించిన పంట దిగుబడి రాలే…. బ్యాంకు నుండి తీసుకున్న అప్పులు ఎలా కట్టాలనే బాధలో…. మనోవేదన కు గురై అనారోగ్యానికి గురికావడం తో మనస్థాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం కొకస్ మన్నూర్ గ్రామం లో చోటుచేసుకుంది..
కుటుంబ సభ్యులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొకస్ మన్నుర్ గ్రామానికి చెందిన చెవుల ఆనంద్ రావ్ (32) అనే రైతు అప్పుల బాధ భరించలేక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన రైతు గత సంవత్సరం ఆక్సిసిస్ బ్యాంకు ఆదిలాబాద్ బ్రాంచి నుండి వ్యవసాయం కోసం 3 లక్షల రూపాయలు బ్యాంకు నుండి ఋణం తీసుకున్నాడు. అప్పు చేసి వ్యవసాయం చేస్తే, పంటలు సరిగ్గ పండక మనోవేదనకు గురి అయ్యేవాడు.

చేసిన అప్పుల గురించి ఆలోచిస్తూ అనారోగ్యానికి గురైయ్యడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆనంద్ రావు ను హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స సైతం చేయించారు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. వర్షాకాలం రావడంతో ఈ సంవత్సరం వ్యవసాయం కోసం ఎక్కడ డబ్బులు దొరకలేదు. చేసిన బాకీ ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని అప్పుడప్పుడు భార్య చెవుల కమలతో చెప్పి బాధ పడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంటి నుండి వెళ్ళిపోయాడు. జీవితం పై విరక్తి చెంది, క్షణికావేశంలో రైతు తన పొలంలో ముందుగా గుర్తు తెలియని పురుగుల మందు తాగి, ఆ తర్వాత మామిడి చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు.
మృతునికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Recent Comments