దివంగత మాజీ ఇచ్చోడ సిఐ వై రమేష్ బాబు కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేసిన అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి
దివంగత పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి*
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
రేయింబవళ్లు విధి నిర్వహణలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జిల్లా పోలీసుల అనారోగ్య సమస్యలపై ప్రతి ఏటా మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో అనారోగ్య కారణంగా మరణించిన స్వర్గీయ ఇచ్చోడ మాజీ సీఐ వై రమేష్ బాబు కుటుంబ సభ్యులకు గురువారం ఉదయం హైదరాబాద్ నందు అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి చేతుల మీదుగా 16 లక్షల విలువ చేసే భద్రత చెక్కులను అందజేయడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, రాష్ట్ర పోలీస్ సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కలిసి సిఐ భార్య వై కవిత రాజ్యం, పిల్లలు వై నికిత, వై తేజస్వి లకు భద్రత కు సంబంధించిన 16 లక్షల విలువ చేసే మూడు చెక్కులను అందజేశారు. భార్యకు ఎనిమిది లక్షలు, ఇద్దరు ఆడపిల్లలకు చేరో నాలుగు లక్షల చొప్పున మూడు చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు. అడిషనల్ డీజీ మాట్లాడుతూ త్వరలోనే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే విధంగా ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జిల్లా పోలీసులు రాష్ట్ర పోలీసులు తమకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎటువంటి సమస్యలకైనా తమ దృష్టికి తీసుకురావాలని హామీ ఇచ్చారు. సిబ్బంది అందరికీ ప్రతి సంవత్సరం హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలోని వివిధ వ్యాధి నిపుణులు డాక్టర్ల బృందం చేత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీస్ అధ్యక్షుడు పోచ లింగం, విరాసత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments