Friday, June 13, 2025

EMRS Results: ఏకలవ్య స్కూళ్లలో 10వేల పోస్టులు.. పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌..

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ వ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో (EMRS) భారీగా ఉద్యోగాల (jobs ) నియామకానికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు (EMRS Exam Results) విడుదలయ్యాయి. మొత్తం 10,391 బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) సోమవారం విడుదల చేసింది.

పీజీటీ (PTG), టీజీటీ( TGT) , హాస్టల్‌ వార్డెన్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (JSA), ల్యాబ్‌ అటెండెంట్‌, అకౌంటెంట్‌ (Accountants ) పోస్టులకు డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో అభ్యర్థులు రాసిన ఈ పరీక్షలో ఎంపికైన వారి వివరాలను పీడీఎఫ్‌ల రూపంలో విడుదల చేసింది.

తదుపరి అప్‌డేట్స్‌ (updates)కోసం క్లిక్ https://emrs.tribal.gov.in/ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి