రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ డిగ్రీ పాసైన అభ్యర్థులు గ్రూప్ 1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సు ఉచిత కోచింగ్ కు దరఖాస్తులు చేసుకోవలెను. అని శ్రీ. కే . రాజలింగు గారు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఆదిలాబాద్ మరియు జి. ప్రవీణ్ కుమార్ డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.
అర్హులైన అభ్యర్థులు 08.01.2024 నుంచి 20.01.2024 వరకు ఆన్ లైన్ “https://studycircle.cgg.gov.in/forwardingAction.do?status=bce. వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలనీ తెలిపారు. దరఖాస్తు కి చివరి తేది: 20.01.2024 .
ఈ ఉచిత శిక్షణ ఫిబ్రవరి 01-02-2024 నుండి ప్రారంభం అవుతుంది. ఈ శిక్షణ నాలుగు నెలలు ఉండును.గతం లో గ్రూప్స్ శిక్షణ తీసుకున్నవారు అప్లై చేయవద్దు, హాస్టల్ వసతి ఉండదు. అభ్యర్ధులకు ఆదాయ ధ్రువీకరణ పత్రం రూ.5.00 లక్షల లోపు ఉండాలి, అభ్యర్ధుల ఎంపిక విధానం రిజర్వేషన్ మరియు డిగ్రీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం స్టడీ మెటీరియల్ అందిస్తారు. మరిన్ని వివరాలకు 08732-221280 నంబర్ కు సంప్రదించాలని సూచించారు.
“https://studycircle.cgg.gov.in/forwardingAction.do?status=bce.
Recent Comments