రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలం లొని వడ్డల్ గూడా గ్రామం లో మద్యం మత్తులో వాటర్ ట్యాంక్ ఎక్కి శివరాత్రి గంగాధర్(23) అనే యువకుడు దూకి మృతి చెందాడు.
ఇచ్చోడ ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శివరాత్రి గంగాధర్ మరియు చిన్నక్క లు భార్యభర్తలు. గంగాధర్ మద్యానికి బానిసయి ఎలాంటి పనులు చేయకుండా తిరిగే వాడు. అయితే ఎప్పటిలాగే గురువారం రోజు కూడా అతిగా మద్యం తాగి గ్రామం లోని నీళ్ల ట్యాంక్ పై ఎక్కి దూకి చనిపోతాను అని బెదిరించాడు. మృతుని భార్య, గ్రామస్తులు దూకొద్దని ఏంతో సముదయించారు. ఎవరి మాట వినలేదు. మద్యం మత్తులో మధ్య రాత్రి 2.30 గంటలకు ట్యాంక్ పై నుండి దూకి చనిపోయాడు. మృతుని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Recent Comments