త్రాగడానికే నీళ్లు లేవు
— ఇకా స్నానాలు ఏం చేస్తాము సారు అంటున్న వర్కవాయి గ్రామస్తులు
రిపబ్లిక్ హిందుస్థాన్ , గాదిగూడ : ఆదిలాబాద్ జిల్లా గాదిగుడా మండలంలోని వర్కవాయి గ్రామంలో త్రాగడానికి నీళ్లు లేక జనం తల్లడిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నళ్లాలు గ్రామంలో ప్రతి ఇంటికి బిగించారు. కానీ నీళ్లు రాక అవి అలంకారప్రాయంగా మారాయి. పేరుకే మిషన్ భగీరథ కెనెక్షన్లు ఇచ్చారని వాపోతున్నారు.
ఈ సందర్భంగా ఆ గ్రామ పటేల్ టేకం లక్ష్మణ్ మాట్లాడుతూ ఊరిలో ఒక్క బోర్ మాత్రమే ఉంది అందులో కూడా నీళ్ళు సరిగ్గా రావడం లేదని నాలుగు, ఐదు బిందేలు కొట్టగానే నీళ్లు అయిపోతున్నాయని, ఇకా మా ఊరి మొత్తానికి ఎలా సరిపోగలదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం ప్రతి యేటా ఇలాగే తంటాలు పడుతున్నామని భగీరథ నీళ్లు రాక పోవడంతో చెలిమేల నుండి నీళ్లు తోడుకోవడానికి సూదురా ప్రాంతాలకు వెళ్లి తీసుక వస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. త్రాగడానికే మంచి నీళ్లు లేవు ఇక స్నానాలు ఎలా చేస్తాం సారు..అని అమాయక కోలాం గిరిజనులు తమ నీటి కష్టాలను రిపబ్లిక్ హిందూస్తాన్ తో పంచుకున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నీటి కష్టాలు దూరం చేయాలని కోలామ్ గిరిజనులు కోరుతున్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments