Thursday, November 21, 2024

పీఎంఎఫ్ఎంఈ డిపీఆర్ ప్రిపేర్ చేసి బ్యాంకుకు సబ్మిట్ చేయండి – జిల్లా లోకల్ బాడీ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ప్రైమ్ మినిస్టర్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైస్ సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ఐకెపి ఎపిఎంలు సిసి వారిగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ప్రిపేర్ చేసి సంబంధించిన బ్యాంకులో సబ్మిట్ చేయాలని జిల్లా లోకల్ బాడీ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు.  గురువారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో బ్యాంక్ మేనేజర్లకు ఏపీఎంలకు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం లోపు ప్రతి మండలంలోని ప్రతి సీసీ ఆయన పరిధిలోని లబ్ధిదారుల యొక్క డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని బ్యాంక్ బ్రాంచ్ వారిగా సబ్మిట్ చేయాలని, ఒకవేళ బ్యాంకు వారు రిజెక్ట్ చేసి ఉంటే తిరిగి వారికి అవకాశం ఇస్తామని డీటెయిల్స్ ప్రాజెక్ట్  రిపోర్ట్ రిజెక్ట్ అయినా వారికి తిరిగి లబ్ధిదారులు సోమవారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు జిల్లా పరిశ్రమల కేంద్రంలోని అధికారులకు సంప్రదించాలని  అక్కడ లబ్ధిదారులకు పీఎంఎఫ్ఎంఈ స్కీం పథకంపై ఎటువంటి అనుమానాలు ఉన్న వారి యొక్క అనుమానాలను నివృత్తి చేయడం జరుగుతుందని ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజ్ అన్నారు.  మండలాలు వారీగా సీసీలు వారి వారి క్లస్టర్లు ఇప్పటివరకు డీపీఆర్ తయారు చేయని వారు వెంటనే డిపిఆర్ తయారు చేయాలని అర్హత లేని వ్యక్తులను ఎంపిక చేసి ఉంటే వెంటనే వారి స్థానంలో కొత్తవారికి డిపిఆర్ తయారు చేయాలని చెప్పారు. ఈ నెల 13వ తేదీ లోపు డిపిఆర్ సబ్మిట్ చేయాలని లేనిచో వారిపై  శాఖ  పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.   ఈ సమావేశంలో పిడి డిఆర్డిఓ కిషన్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజ్ , ఏపీడి అరక చరందాస్ , ఎస్బిఐ చీఫ్ మేనేజర్ టి జి బి ఏవో చక్రపాణి, యూపీఐ ఎస్బిఐ ఎల్డీఎం ప్రసాద్ డిపిఎంలు లంకా సుగంధ , బ్యాంకు లింకేజీ శోభారాణి, నాన్ ఫామ్ డిపిఎం గంగన్న, ఐబీ డీపీఎం హేమలత, ఫైనాన్స్ డిపిఎం నరేందర్, ఇన్సూరెన్స్ డిపిఎం శశి రావు, బ్యాంక్ మేనేజర్లు ఫీల్డ్ ఆఫీసర్లు 17 మండలాల ఏపీఎంలు కొన్ని మండలాల సీసీలు అర్జీ పెట్టుకున్న లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి